గీత గోవిందం బ్లాక్ బస్టర్ సక్సస్ తో విజయ్ దేవరకొండ, రష్మిక బాగా క్లోజ్ అయిపోయారు. అందుకే డియర్ కామ్రేడ్ లో కూడా విజయ్ కావాలనే రష్మికను తీసుకున్నాడు. ఇలా వీళ్లిద్దరిపై ఓ రేంజ్ లో కామెంట్స్ వచ్చాయి. అయితే అలాంటిదేం లేదని రష్మిక క్లారిటీ ఇచ్చింది. అంతేకాదు విజయ్ దేవరకొండతో ముద్దుసీన్లపై కూడా రియాక్ట్ అయింది. గీతగోవిందంలో ముద్దు సీన్ హిట్ అయింది కాబట్టి, డియర్ కామ్రేడ్ లో ముద్దు సీన్ పెట్టలేదు. కథ డిమాండ్ చేసింది కాబట్టి డైరెక్టర్ భరత్ కమ్మ లిప్ లాక్ సీన్ పెట్టారని ఈ సీన్స్ కథకు ఎంతో ఇంపార్టెంట్ అని చెప్పింది.

"థియోట్రికల్ ట్రైలర్ లో ఉన్న ముద్దు సీన్ గురించే మాట్లాడుకుంటే నేనేమి చేయలేను..ఎక్కువశాతం సినిమా యాంగిల్ లో కూడా చూసేవాళ్లు ఉంటారు కదా. ఏదైనా చూసే జనాల మైండ్ సెట్ లోనే ఉంటుంది. మా వరకు మేం మాత్రం రెండుపాత్రలు పోషించాం. అందులో భాగంగా ముద్దులు పెట్టుకున్నాం" అంటూ వీటిపై వస్తున్న గాసిప్స్ ని మైండ్ లో పెట్టుకొని సూటిగా, తెలివిగా సమాధానం చెప్పింది రష్మిక.

ప్రస్తుతానికైతే తన మనసులో ఎవరూ లేరని స్పష్టంచేస్తూ చాలా ఏళ్లుగా సింగిల్ గానే ఉన్నానని, ప్రస్తుతానికి సినిమాలు, జిమ్ తోనే టైమ్ అంతా అయిపోతోందని.. డేటింగ్ కు అస్సలు టైమ్ దొరకడం లేదంటోంది రష్మిక. ఇక యూత్ లో బాగా క్రేజ్ ఉన్న విజయ్-రష్మిక కాంబినేషన్ లో థియోటర్స్ లోకి వస్తున్న డియర్ కామ్రేడ్ పై భారీగా అంచనాలున్నాయి. మరి రీసెంట్‌గా వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా భారీ కలెక్షన్స్ ని రాబడుతూ దూసుకుపోతోంది. మరి ఈ దూకుడుకి డియర్ కామ్రేడ్ బ్రేక్ వేస్తుందా..లేదా అన్నది త్వరలో తెలియనుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: