మొత్తానికి 'వినయ విధేయరామ' ప్లాప్ ఎఫెక్ట్ యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను పై బాగానే పడింది ఎప్పుడూ వరుస ఆఫర్స్ తో బిజీ బిజీగా ఉండే బోయపాటి, ఆ సినిమా ప్లాప్ వల్ల చాలా గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. ఎట్టకేలకూ బోయపాటి - అల్లు అర్జున్ కాంబినేషన్ లో అల్లు అరవింద్ నిర్మాణంలో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం పక్కా యాక్షన్ ఎంటర్ టైనర్ గా రానున్న ఈ సినిమా నవంబర్ నుండి సెట్స్ మీదకు వెళ్ళబోతున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా నవంబర్ నుండి మళ్లీ నరుకుడే అన్నమాట.
ప్రస్తుతం అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇక గతంలో బోయపాటి - అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన 'సరైనోడు' సినిమా సూపర్ హిట్ అయింది. ఈ సినిమా హిందీ డబ్బింగ్ వర్షన్ ను అక్కడి జనాన్ని బాగా ఆకట్టుకుంది. మరి ఈ సారి కూడా వీరి కాంబినేషన్ సూపర్ హిట్ అవుతుందేమో చూడాలి. అయితే బోయపాటి - బాలయ్య సినిమా కూడా ఉంటుందని ఫిల్మ్ నగర్ టాక్. కాకపోతే అల్లు అర్జున్ సినిమా తరువాత వచ్చే ఏడాది బాలయ్యతో సినిమా ఉంటుందట.