ఆమె పేరు రుహానీ  శ‌ర్మ. తెలుగులో ఓ సినిమాలో నటించింది. ఆ మొదటి సినిమాలో తెలుగింటి పడతిలా చాలా పద్ధతిగా కనిపించిన రుహాని శర్మ తన శైలి అది కాదనే సంగతి రిజిష్టర్‌ చేయడానికి చాలా కష్టపడుతూ వస్తోంది. అందుకోసం సోషల్ మీడియాను తెగ వాడేసుకుని కుర్ర కారుకు బాగా  శోష పుట్టించేసింది.


ఇదిలా ఉండగా తాను చేసిన ఫస్ట్ మూవీ  చిలసౌ చిత్రం వల్ల తనకో స్క్రీన్‌ ఇమేజ్‌ వచ్చేయడంతో దానిని బ్రేక్‌ చేసి గ్లామర్‌తో ఆకట్టుకోవాలని రుహాని చూస్తోందట. పూర్తిగా ట్రెడిషనల్ లుక్ తో  ఉంటే ఆఫర్లు రావేమోనని  బెంగెట్టేసుకుంటున్న ఈ కుర్ర కుమారం ఇపుడు పరువాల పదనిసల గుట్టు విప్పి చెబుతోంది.


ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పటికే చాలా హాట్‌ ఫోటోలు పెట్టి యూత్ గుండెలను చిదిమేసిన ఈ అమ్మడు తాజాగా  సైమా షార్ట్‌ ఫిలిం అవార్డులకి వి నెక్‌ గౌను వేసుకుని వచ్చి హాట్‌ హాట్‌గా మురిపించింది. త్వరలో సైమా ఈవెంట్‌లో కూడా ఈమె పాల్గొనబోతోంది. 


షార్ట్‌ ఫిలిం అవార్డులకే ఇంత షార్ట్‌ గౌనులో ఇంత హాట్‌గా కనిపిస్తే ఇక అసలు వేడుకలో రుహానీ ఇంకెంత హాట్‌గా దర్శనమిస్తుందోనని చిట్టి గుండెలు బిక్కుబిక్కుమంటున్నాయి. అయినా తన పని తనదే అన్నట్లుగా రుహా శ‌ర్మ హాట్ ఫోజులు లైవ్ లో ఇచ్చేందుకు రెడీ ఐపోతోంది. సో ఎవరికైనా హార్ట్ అటాక్ వస్తే మాత్రం తన తప్పు కాదంటోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: