ఇంటర్నెట్ వినియోగం పెరిగిన తర్వాత డిజిటల్ మీడియాలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. టి విషో లు వెబ్ సిరీస్ లు సాంప్రదాయ సినీరంగానికి సవాల్ విసురుతున్నాయి. సినిమాలు కేవలం థియేటర్ లోనే  కాకుండా డిజిటల్ మాధ్యమాల  ద్వారా చూసే ప్రజలు ఎక్కువ అవుతున్నారు.
 
నెట్ ఫ్లిక్, అమెజాన్,హాట్ స్టార్ వంటి అంతర్జాతీయ సంస్థలు ఇప్పటికే ఈ రంగంలో వేలకోట్ల పెట్టుబడులు పెట్టి చిత్రాలు నిర్మిస్తున్నారు.తక్కువ సమయంలో మెరుగైన పారితోషికం అందటంతో స్టార్స్ సైతం ఈ వెబ్ సిరీస్ లలో నటించడానికి సుముఖత చూపిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది స్టార్స్ వెబ్ సిరీస్ లలో నటించారు.


అదీగాక వెబ్ సిరీస్ కి సెన్సార్ కూడా లేకపోవడంతో దర్శకులకి ఫ్రీడం దొరికినట్టయింది. వాళ్ళు చెప్పాలనుకున్న విషయాన్ని మరింత స్వేఛ్ఛగా చెప్పవచ్చు. తెలుగులో కూడా వెబ్ సిరీస్ లు జోరందుకున్నాయి. తాజాగా బ్యూటీ కాజల్ కూడా ఓ వెబ్ సిరీస్ లో నటించడానికి అంగీకరించారని సమాచారం.

తమిళ పరిశ్రమకు చెందిన దర్శకుడు వెంకట్ ప్రభుతో హాట్ స్టార్ ఓ వెబ్ సిరీస్ నిర్మించడానికి ఒప్పందం కుదుర్చుకోగా అందులో కాజల్ నటించనుందట. పది ఎపిసోడ్స్ గా ప్రసారం కానున్న ఈ సిరీస్ సెప్టెంబర్ నుండి చిత్రీకరణ మొదలుకానుంది సమాచారం. ఐతే దీనిపై ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. మరి ఈ వార్తలో ఎంత వరకు వాస్తవం ఉందో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: