క‌న్న‌డ క‌స్తూరి ర‌ష్మిక మంద‌న్న వ‌ర‌స హిట్ల‌తో సౌత్‌లో దూసుకుపోతుంది. ఆమె క‌న్న‌డ అమ్మాయి అయినా క‌న్న‌డ కంటే తెలుగు, త‌మిళంలోనే స్టార్ హీరోల స‌ర‌స‌న ఎక్కువ‌గా న‌టిస్తోంది. తాజాగా ఆమె పెంచిన రెమ్యున‌రేష‌న్ చూసి చాలా మంది షాక్ అయ్యారు. తెలుగు సినిమాల‌కు ఎక్కువ రెమ్యున‌రేష‌న్ ఉండ‌డంతో.. ఆమె క‌న్న‌డ క‌న్నా తెలుగు సినిమాలే ఎక్కువుగా చేస్తోంది. ఇటీవ‌ల ఓ ఇంటర్వ్యూలో రష్మిక చేసిన వ్యాఖ్యలపై ఇప్ప‌టికే మండిప‌డుతున్న కన్నడిగులు మ‌రింతగా ఆమెపై పైర్ అవుతున్నారు.


దీంతో తాజాగా మ‌రో వివాదం ఆమెకు చుట్టుకుంది. ఇటీవల ఓ తమిళ వెబ్‌సైట్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను కన్నడ సరిగా మాట్లాడలేనని రష్మిక చెప్పింది. కన్నడ భాషలో డబ్బింగ్ చెప్పడం చాలా కష్టం అని తెలిపింది. రష్మిక వ్యాఖ్యలపై క‌న్న‌డ భాషాభిమానులు మండిపడుతున్నారు. త‌న మాతృభాషను తాను మాట్లాడ‌లేక‌పోవ‌డం ఏంటి? అన్న దానిపై గుర్రుగా ఉన్నారు. అలాగే ఆమెను క‌న్న‌డ ఇండ‌స్ట్రీ నుంచి తొలిగించాల‌ని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.


అలాగే తాజాగా ఈ శుక్రువారం రాబోతున్న ఆమె కొత్త సినిమా డియ‌ర్ కామ్రేడ్ తెలుగు, తమిళతో పాటూ కన్నడలోనూ డబ్బింగ్ అవుతోంది. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ట్రైల‌ర్‌, సాంగ్స్ మంచి క్రేజ్ తెచ్చుకుంది. అయితే ఈ వివాదంతో డియ‌ర్ కామ్రేడ్ సినిమాకు క‌న్న‌డ‌లో ఎఫెక్ట్ త‌ప్ప‌ద‌ని అంటున్నారు. ఈ వివాదంలో చిక్కుకున్న ఆమెను శాండల్‌వుడ్ నుంచి తప్పించాలనీ, ఆమెపై నిషేధం విధించాలని డిమాండ్ చేసింది.



మరింత సమాచారం తెలుసుకోండి: