ప్రస్తుతం టాలీవుడ్ హీరోల్లో యూత్ మరియు అమ్మాయిల్లో మంచి ఫాలోవింగ్ సంపాదిస్తూ వరుస విజయాలతో దూసుకుపోతున్న యువ హీరో విజయ్ దేవరకొండ. పెళ్లి చూపులు సినిమాతో హీరోగా మారిన విజయ్, ఆ సినిమా సక్సెస్ సాధించడంతో అక్కడినుండి వచ్చిన అవకాశాలను బాగానే సద్వినియోగం చేసుకున్నారు. ఆపై ఆయన నటించిన అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాలు సూపర్ డూపర్ హిట్స్ సాధించి, విజయ్ కి టాలీవుడ్ లో స్టార్ హీరో స్టేటస్ ని తెచ్చిపెట్టాయి. 

ఇకపోతే ప్రస్తుతం అయన హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ డియర్ కామ్రేడ్. యువ దర్శకుడు భరత్ కమ్మ తొలిసారి మెగాఫోన్ పడుతున్న ఈ సినిమా ట్రైలర్ ఇటీవల యూట్యూబ్ లో విడుదలై ప్రస్తుతం అత్యధిక వ్యూస్ తో దూసుకుపోతోంది. అయితే ఈ ట్రైలర్ విడుదల తరువాత సినిమాపై అంచనాలు అమాంతం పెరిగాయని చెప్పాలి. ఇకపోతే ఈ సినిమా ట్రైలర్ చూసి మెచ్చుకున్న బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్, తన ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమాను హిందీలో డబ్ చేసి విడుదల చేయాలని రైట్స్ కూడా కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు తెలుగులో క్రేజీ హీరోగా దూసుకుపోతున్న విజయ్ గురించి ఇదివరకే తెలిసిన అక్కడి కొందరు నార్త్ ఇండియన్ యువత, వామ్మో విజయ్ దేవరకొండ అంటున్నారట. 

అయితే అది భయపడి కాదండి, ఎంతో ఇష్టపడి. దానికి కారణం అయన హీరోగా రూపొందిన అర్జున్ రెడ్డి సినిమా ఇటీవల కబీర్ సింగ్ పేరుతో హిందీలో రీమేక్ కావడంతో, ఆ సినిమా తెలుగు వర్షన్ ని వీక్షించిన పలువురు యువత, కొన్ని సన్నివేశాల్లో షాహిద్ కపూర్ కంటే విజయ్ ఎంతో సహజంగా నటించారని, అలా నటించడం కూడా ఎంతో కష్టమని అతడిపై పొగడ్తలు కురిపించారట. ఇక ప్రస్తుతం హిందీలో కూడా డబ్ కాబోతున్న డియర్ కామ్రేడ్ సినిమా కనుక అక్కడ మంచి సక్సెస్ సాధిస్తే, విజయ్ కు బాలీవుడ్ లో కూడా అవకాశాలు రావడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు. మరి విజయ్ అక్కడ ఎంతవరకు సక్సెస్ ని అందుకుంటాడో చూడాలి.....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: