బిగ్ బాస్ సీజన్ 3 సోమవరాం ఎపిసోడ్ నుండే డ్రామా మొదలైంది. అసలు సీజన్ 2 గొడవల వల్ల హౌజ్ లోని అందరు బాధపడ్డారు. అందుకే ఈ సీజన్ ఎలాంటి గొడవలు లేకుండా చూసుకోవాలని అనుకున్నారు. అలా అనుకున్నంత మాత్రానా అలా ఉండగలరా చెప్పండి.. యాజిటీజ్ గా రెండో రోజే నువ్వలా అంటే నువ్వలా అంటూ గొడవ మొదలు పెట్టారు.


మంగళవారం ఎపిసోడ్ లో శ్రీముఖి వర్సెస్ హిమజ గొడవ తెలిసిందే. ఇక బుధవారం లేటెస్ట్ గా హేమ వర్సెస్ సింగర్ రాహుల్ డిష్యుం డిష్యుం జరిగింది. ప్రస్తుతం మోనీటర్ గా ఉంటూ వంట గది బాధ్యతలను చూస్తున్న హేమ ఇంట్లో ఉన్న వంట సామాను.. రోజుకి వంట ఎలా సరిపోతుంది అన్న విషయం మీద మాట్లాడుతున్నారు.


ఇంతలో శ్రీముఖి రాహుల్, ఆలిలతో మాట్లాడుతుండగా మీరెవరు దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని హేమ అన్నది.. అయితే దానికి హర్ట్ అయిన రాహుల్ ఇంట్లో ఫుడ్ గురించి మాట్లాడే హక్కు అందరికి ఉంటుందని చెప్పాడు. ఆ గొడవే కాస్త పెద్దదైంది. హేమక్కా హేమక్కా అనుకుంటూ రాహుల్ హేమతోనే గొడవ పెట్టుకోవడం విశేషం.    


ఇక ఈ గొడవకు కారణం ఎవరన్నది మాత్రం చెప్పలేం. రాహుల్ వర్షన్ రాహుల్ చెబుతున్నాడు. అయితే హేమ మీకెందుకు అందరికి సరిపోయేలా తాను వడి పెడతా కదా అని చెప్పకుండ మీకెందుకు అసలు అనడం గొడవలో ఆమెదే తప్పన్నట్టు వ్యక్తమవుతుంది. ఏది ఏమైనా బిగ్ బాస్ సీజన్ 3లో మూడవరోజుకే తారాస్థాయిలో గొడవ జరిగింది. మరి రానున్న రోజుల్లో ఇంకెలా ఉంటుందో చూడాలి.   



మరింత సమాచారం తెలుసుకోండి: