యువ హీరో విజయ్ దేవరకొండ భరత్ కమ్మ కాంబినేషన్ లో ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా డియర్ కామ్రేడ్. రష్మిక హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు. తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ భాషల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా బాహుబలి తర్వాత అంతటి క్రేజ్ తెచ్చుకుందని చెప్పొచ్చు.


ఓ తెలుగు సినిమా అన్ని భాషల్లో రిలీజ్ అవడం చూస్తే అలా కూడా బాహుబలి తర్వాత డియర్ కామ్రేడ్ కే ఆ అదృష్టం దక్కింది. అయితే హిందిలో ఈ సినిమా రిలీజ్ చేయాలని అనుకోలేదు. కాని డియర్ కామ్రేడ్ హింది రీమేక్ రైట్స్ మాత్రం ధర్మ ప్రొడక్షన్స్ అధినేత కరణ్ జోహార్ దక్కించుకున్నారు.


సినిమా చూసిన కరణ్ జోహార్ మూవీ అదిరిపోయిందని.. రీమేక్ చేస్తున్నందుకు సంతోషంగా ఉందని అన్నారు. అయితే ఈ రీమేక్ లో కూడా విజయ్ దేవరకొండనే నటించమని అడిగాడట కరణ్ జోహార్. ఒకసారి చేసిన సినిమా మరోసారి చేయడం కుదరదని చెప్పాడట విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి సినిమాకు కూడా సందీప్ వంగ ముందు విజయ్ తోనే ఆ రీమేక్ చేయాలని అనుకున్నాడు.


విజయ్ దేవరకొండ చేయనని చెప్పేసరికి షాహిద్ కపూర్ తో చేసి సూపర్ హిట్ కొట్టారు. మరి ఇప్పుడు డియర్ కామ్రేడ్ ఎవరు చేతుల్లోకి వెళ్తుందో చూడాలి. బాలీవుడ్ లో అభిరుచి గల నిర్మాతగా కరణ్ జోహార్ సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు. ఈమధ్య ఆయన సౌత్ సినిమాల మీద ఎక్కువ ఫోకస్ పెట్టాడు. రీసెంట్ గా రిలీజై సూపర్ హిట్టైన నాని జెర్సీ సినిమాను కూడా కరణ్ రీమేక్ రైట్స్ కొన్నట్టు టాక్. మొత్తానికి తెలుగు సినిమాల రీమేక్ లతో కరణ్ జోహార్ పెద్ద ప్లాన్ వేశాడని చెప్పొచ్చు.  



మరింత సమాచారం తెలుసుకోండి: