బుల్లితెరపై ముచ్చటగా మూడోసారి బిగ్ బాస్ సందడి మొదలైంది. కింగ్ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న బిగ్ బాస్ సీజన్ 3 హంగామా జూలై 21 నుంచి ప్రారంభమైంది. మొత్తం 15 మంది సెలబ్రిటీలు బిగ్ హౌజ్‌లోకి అడుగుపెట్టారు. వీళ్లంతా టీవీ, సినిమా రంగాలకు చెందిన సెలబ్రిటీలే. వాళ్ల‌ మధ్య జరిగే యుద్ధం ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతుంది. భావోద్వేగానికి గురిచేస్తుంది. రేపు ఏం జరగబోతుంది అనే క్యూరియాసిటీని క్రియేట్ చేస్తుంది. 


నిజానికి బిగ్ బాస్ షో అనేది డచ్ బిగ్ బ్రదర్ అనే రియాలిటీ షో నుంచి వచ్చింది. దాన్ని ఆధారంగా తీసుకుని బిగ్‌బాస్ షోను  డిజైన్ చేశారు. ఇదేదో టైమ్ పాస్ కోసం సృష్టించిన షో కాదు. ఊరికే సృష్టించిన షో కాదు. దీని వెనుక పెద్ద సైన్స్ ఉంది. బిగ్ బాస్ హౌస్ లో 100 రోజులు ఉండటం అంటే మామూలు విషయం కాదు. 100 రోజులు బిగ్‌బాస్‌ ఇంట్లో గడపడం అంటే అది సవాల్ తో కూడుకున్న పనే. నిత్యం కెమెరాల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో జ‌రిగే ఈ హౌస్‌లో తోటి వారితో చాలా జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాలి. 


అలాగే బిగ్ బాస్ ఇచ్చే టాస్కులు ఎంతో స‌హ‌నంతో స‌క్సెస్ చేసుకుంటు.. త‌మ‌కు ఎక్కు ఓట్లు ప‌డేలా చేసుకోవాలి. బిగ్ బాస్ షో అంటేనే వివాదాలు.. కాంట్ర‌వ‌ర్సీలు.. ఒక‌రినొక‌రు అరుచుకోవ‌డం. ఎంత ప్రేమ‌గా ఉండాల‌ని ట్రై చేసినా కూడా ఏదో ఒక‌టి చేసి వాళ్ల మ‌ధ్య చిచ్చు పెడుతూ వారి స‌హ‌నాన్ని, వ్య‌క్తిత‌త్వాన్ని ప‌రిక్షించ‌డం బిగ్ బాస్ ప‌ని. అయితే  బిగ్ బాస్ విన్నర్ ఫార్ములా ఏంటంటే… సహనం(పేషెన్స్) + సహజత్వం(స్పాంటెనిటీ) = సానుభూతి(సింపతీ) = ఎక్కువ ఓట్లు = విన్నర్. మాస్ట‌ర్ ప్లానింగ్‌తో ఈ కోడ్‌ను ఢీ కోడ్ చేస్తే విజ‌యం వారి సొంతం అవుతుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: