బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా రమేష్ వర్మ దర్శకత్వంలో రాబోతున్న చిత్రం “రాక్షసుడు”. తమిళంతో విజయవంతమైన “రాక్షసన్” చిత్రానికి తెలుగు రీమేక్ గా తెరకెక్కింది ఈ చిత్రం. స్కూల్ కి వెళ్లే టీనేజ్ అమ్మాయిలను కిడ్నాప్ చేసే వారి ప్రాణాలు తీసే సైకో కిల్లర్ కథాంశంతో క్రైమ్ థ్రిల్లర్ గా రానున్న ఈ సినిమా ఆగష్టు 2న రిలీజ్ కానుంది. కాగా అనుపమ పరమేశ్వరన్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సినిమా గురించి అనుపమ పరమేశ్వరన్ మీడియాత ముచ్చ‌టించారు....
 
రాక్షసుడు గురించి ...
తమిళ్ “రాక్షసన్” సినిమాకి తెలుగు రీమేక్ గా ఈ ‘రాక్షసుడు’ వస్తోంది. ముందుగా ఈ స్క్రిప్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమా ఒక క్రైమ్ థ్రిల్లర్.. సినిమాలో థ్రిల్లింగ్ అంశాలు హైలెట్ గా ఉంటాయి. సినిమా కూడా చాలా బాగా వచ్చింది అన్నారు.
 
 మీ పాత్ర గురించి...
ఈ సినిమాలో టీచర్ క్యారెక్టర్ లో కనిపిస్తాను. నేనింత వరకూ ఇలాంటి క్యారెక్టర్ చెయ్యలేదు. టీచర్ గా చెయ్యటానికి.. టీచర్ లా కనిపించడానికి చాలా జాగ్రత్తలు తీసుకున్నాను. మరి రేపు సినిమాలో నన్ను చూసి ఆడియన్స్ ఎలా ఫీల్ అవుతారో అనే టెన్షన్ కూడా ఉంది. అలాగే ఆ పాత్ర‌కు త‌గిన‌ట్టుగా నా డ్ర‌స్సింగ్ స్టైల్ కూడా ఉంటుంది.ఈ చిత్రంలో నేను అన్నీ శారీస్ కట్టాను. 
 
అమ‌లాపాల్ పాత్ర‌లో మీరు ఎలా అనిపిస్తుంది...
 అమలా పాల్ అంటే నాకు చాలా బాగా ఇష్టం అండి. ఇక తను చేసిన రోల్ ను నేను చెయ్య‌డం చాలా ఆనందంగా  అనిపించింది. అయితే తనలా యాక్ట్ చెయ్యటానికి నేను ఎక్కడా ట్రై చెయ్యలేదు. ఆ పాత్రలో నా వరకూ నేను సహజంగా నటించడానికి ట్రే చేశాను. నా బాడీ లాంగ్వేజ్‌లో నేను న‌టించాను. ఇక అమ‌లాపాల్ చేసే క్యారెక్ట‌ర్స్ అన్నీ చాలా డిఫ‌రెంట్‌గా ఎంచుకుంటుంది. అందుకే త‌ను అంటే నాకు ఇష్టం.
 
డబ్బింగ్ మీరే చెప్పారా ...
నేనే చెప్పాను. కానీ డబ్బింగ్ చెప్పే సమయంలో నిజానికి నా వాయిస్ అసలు బాగాలేదు. డైరెక్టర్ గారికి చెప్పాను. ప్రజెంట్ వాయిస్ కూడా బాగాలేదు వేరే ఎవరి చేతైనా చెప్పించండి అంటే .. లేదూ నేనే చెప్పాలి అని రమేష్ వర్మగారు పట్టుబడితే అప్పుడు నేను చెప్పాను.
 
అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసారా ...
అవును. ఓ మలయాళ సినిమాకి పని చేశాను. అసిస్టెంట్ గా పని చేస్తోన్నప్పుడు నిజంగా అసిస్టెంట్ గానే పనిచేసేదాన్ని. ఎలాంటి ఫెసిలిటీస్ ఉండేవి కాదు. అయినా డైరెక్షన్ అంటే ఫ్యాషన్. అందుకే అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశాను.
 
మరి భవిష్యత్తులో మిమ్మల్ని డైరెక్టర్ గా చూడొచ్చా ...
తప్పకుండా డైరెక్షన్ చేస్తాను. కొన్ని ఐడియాలు కూడా ఉన్నాయి. అయితే ప్రస్తుతం యాక్టింగ్ పైనే నా దృష్టి అంతా ఉంది.
 
మీరు  ఏ భాషలో మీకు ఎక్కువుగా కంఫర్ట్‌  అనిపిస్తుంది ...
తెలుగులో మలయాళంలోనే నేను ఎక్కువ సినిమాలు చేశాను. కన్నడలో ఒక సినిమా అండ్ తమిళ్ లో ఒక సినిమా మాత్రమే చేశాను. బేసిగ్గా మలయాళం అండ్ తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేశాను కాబట్టి.. ఇక్కడే నాకు ఎక్కువుగా కంఫ‌ర్ట్‌ ఉంటుంది.
థ్రిల్ల‌ర్స్ అంటే ఇష్ట‌మేనా...
అవునండి నాకు క్రైమ్ థ్రిల్ల‌ర్స్ అంటే చాలా ఇష్టం. ఇది క‌థ న‌చ్చి నేను చెయ్య‌డానికి ఒప్పుకున్నాను. ముందు మా నాన్న‌గారు ఈ సినిమా చూశారు ఆయ‌న‌కి బాగా న‌చ్చి న‌న్ను కూడా చూడ‌మ‌న్న‌రు. ఇలాంటి క‌థ‌లు నువ్వు ఎలాగైన చెయ్యాలి అన్నారు. నాకు కూడా క‌థ న‌చ్చి చేశాను.
 
మీ తదుపరి చిత్రాలు...
ప్రస్తుతం ‘నిన్ను కోరి’ తమిళ్ రీమేక్ లో నటిస్తున్నాను. అలాగే తెలుగులో కూడా రెండు కథలు ఉన్నాయి. ఇంకా ఫైనల్ కాలేదు. ప్రెజెంట్ అయితే రాక్షసుడు సినిమా రిలీజ్ కోసమే ఎంతో ఆసక్తిగా ఉన్నాను.


మరింత సమాచారం తెలుసుకోండి: