అక్కినేని నాగార్జున సూపర్ హిట్ సినిమాల్లో 'సోగ్గాడే చిన్నినాయన' కూడ ఒకటి.  2015 లో విడుదలైన ఈ చిత్రం కుటుంబ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుని భారీ విజయాన్ని అందుకుంది.  ఈ చిత్రంలో  నాగార్జున చేసిన బంగార్రాజు పాత్రకు విశేషమైన స్పందన లభించింది.  దీంతో దర్శకుడు కళ్యాణ్ కృష్ణ, నాగార్జున ఇద్దరూ ఆ చిత్రానికి సీక్వెల్ తీయబోతున్న సంగతి తెలిసిందే. అయితే బంగార్రాజు సినిమాను సంక్రాంతికి విడుద‌ల అనుకున్నారు. కానీ బంగార్రాజు సంక్రాంతికి వ‌చ్చేలా  క‌నిపించ‌డం లేదు.


ప్రస్తుతం నాగ్  రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో  మ‌న్మ‌థుడు-2తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తరువాత  ఎలాగూ  బిగ్‌ బాస్‌-3 కోసం నాగ్  మూడు నెల‌ల పాటు బిజీ అవ్వనున్నాడు.  దాంతో అనుకున్న సమయానికి  బంగార్రాజు సినిమా సెట్స్ పైకి వెళ్లేలా కనిపించడం లేదు. ఇక వ‌చ్చే ఏడాదే  వేస‌విలోనే బంగార్రాజు  విడుద‌ల ఉండొచ్చు.  


మరింత సమాచారం తెలుసుకోండి: