జూనియర్ ఎన్టీఆర్ టైం టాలీవుడ్ ఇండస్ట్రీలో నడుస్తున్నట్లు ప్రస్తుత పరిణామాలను బట్టి తెలుస్తుంది. వరుస హిట్లతో టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అనేక రికార్డులు సృష్టిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ భవిష్యత్తులో చేయబోయే ప్రాజెక్టుల గురించి బయటకు వస్తున్న వార్తలు టాలీవుడ్ ఇండస్ట్రీ లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో మల్టీ స్టారర్ సినిమా చేస్తున్న జూనియర్ ఎన్టీఆర్ త్వరలోనే కే జి ఎఫ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ కోసం డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్లు ఫిలింనగర్ లో వార్తలు వినపడుతున్నాయి.


ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన స్టోరీ రూపకల్పనలో డైరెక్టర్ నిమగ్నమైనట్లు ఫిలింనగర్ లో టాక్. దీంతో వీరిద్దరి సెన్సేషన్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా స్టోరీ గురించి ఒక వార్త సౌత్ ఇండస్ట్రీలో హల్ చల్ చేస్తుంది. వచ్చిన వార్త బట్టి చూస్తే జూనియర్ ఎన్టీఆర్ అంటే డ్యాన్స్ కి కేరాఫ్ అడ్రస్ అని అందరికీ తెలిసినదే. దీంతో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ హీరోగా ఓ డ్యాన్స్ బేస్డ్ మూవీని ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. స్టోరి లైన్ ఏమిటి? అన్నది ఇంకా రివీల్ కాలేదు.


అయితే తారక్ అనగానే డ్యాన్సుల్లో స్పెషలిస్ట్. భారతదేశంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ డ్యాన్సర్ గా అతడికి గుర్తింపు ఉంది. అందుకు తగ్గట్టే ప్రశాంత్ నీల్ తెలివిగా ఈ తరహా కాన్సెప్టును రెడీ చేస్తున్నాడా? అంటూ అభిమానుల్లో ఆసక్తి మొదలైంది. మొత్తం మీద జూనియర్ ఎన్టీఆర్ నుండి ఎన్‌టి‌ఆర్ ఫాన్స్ ఎప్పటి నుండో రావాలనుకుంటున్న సినిమా రూపకల్పన జరగబోతున్నట్లు వార్తలు రావడంతో వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న సినిమాపై మంచి జోష్ మీద ఉన్నారు ఎన్టీఆర్ అభిమానులు.



మరింత సమాచారం తెలుసుకోండి: