ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కలయికలో తెరకెక్కిస్తున్న భారీ మల్టి స్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్. టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు దేశవ్యాప్తంగా అన్ని సినిమా ఇండస్ట్రీల్లో విపరీతమైన అంచనాలున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ శివారు ప్రాంతంలో వేసిన ప్రత్యేక సెట్‌లో జరుగుతోంది. 

మొదట్లో ఈ సినిమా ప్రారంభ సమయములో షూటింగ్ పెద్దగా బ్రేకుల్లేకుండా ముందుకు సాగింది. అయితే కొన్నాళ్ల క్రితం రాజమౌళి కుమారుడు కార్తికేయ పెళ్లి కారణంగా, అలానే మొన్నామధ్య హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ లు వరుసగా గాయపడంతో మధ్య మధ్యలో షూటింగ్ కు బ్రేకులు పడ్డాయి. అలానే రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా నటిస్తున్న అలియా భట్ అనారోగ్యం కారణంగా కూడా మరికొద్ది రోజలు బ్రేక్ పడడంతో యూనిట్ కు కొంత చికాకులు తప్పడంలేదట. ఇకపోతే కొద్దిరోజుల్లో రామ్ చరణ్ మరోసారి బ్రేక్ తీసుకోనున్నాడని తెలుస్తోంది. ఈ మేరకు డైరెక్టర్ రాజమౌళికి ముందుగానే సమాచారం ఇచ్చాడని అంటున్నారు. మరి ఈ విధంగా పలువిధాలుగా బ్రేకులతో కుంటుపడుతూ మెల్లగా ముందుకు సాగుతున్న ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్, 

ఇలాగే మరికొద్దిరోజులు నత్తనడకన సాగితే, సినిమాను ఎట్టిపరిస్థితుల్లో అనుకున్న సమయానికి పూర్తిచేయలేరని, తద్వారా విడుదల తేదీని మార్చక తప్పదని ఫిలింనగర్ లో వార్తలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. మరి ప్రస్తుతం పుకారవుతున్న ఈ వార్తల్లో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయో తెలియనప్పటికీ, ఒకేవేళ ఆర్ఆర్ఆర్ మూవీ వాయిదా పడితే మాత్రం, అది సినిమాకు కొంత నష్టం చేకూర్చే అవకాశం లేకపోలేదని అంటున్నారు సినీ విశ్లేషకులు.....!!   


మరింత సమాచారం తెలుసుకోండి: