గత ఏడాది విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించి సౌత్ ఇండియన్ సినిమా కేజీఎఫ్,కన్నడ సినిమా స్థాయిని పెంచి ఇండియన్ సినిమా పెద్దలు కన్నడ సినిమా గురించి మాట్లాడుకునేలా చేసిన ఘనత కేజీఎఫ్ చిత్రానికి దక్కింది.బాహుబలి తర్వాత ఇండియన్ స్క్రీన్ మీద అంతలా సినీ ప్రియులను కట్టిపడేసిన కేజీఎఫ్ చాప్టర్ 2 కోసం సినిఅభిమానులు ఎదురుచూస్తున్నారు.


కేజీఎఫ్ చిత్ర యూనిట్ రేపు 11 గంటలకి ఓ షాకింగ్ న్యూస్ విడుదల చేస్తాం అని చెప్పారు. ప్రస్తుతం ఆ వార్త వైరల్ గా మారింది. కేజీఎఫ్ మొదటి భాగంలో కొంత మంది ప్రతినాయకులని,కొంత మంది కీలక పాత్రలని చూపించకుండా మిస్టరీగానే మిగిల్చాడు చిత్ర దర్శకుడు అయితే ఆ పాత్రదారులు ఎవరనేది ఈ రెండవ భాగంలో చూపించనున్నారు.ఇప్పటికే కొంత మంది ప్రముఖ నటులు సంజయ్ దత్, రవీనా,రమ్యకృష్ణ రెండవ భాగంలో నటిస్తున్నారని సమాచారం.


కేజీఎఫ్ చిత్రంలో అధీర అనే పాత్రకు సంబంధించిన వివరాలు జులై 29 రోజు విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే జులై 29 సంజయ్ దత్ పుట్టినరోజు అయినందున కచ్చితంగా అధీర పాత్రలో నటించింది సంజయ్ దత్ అని అభిమానులు అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: