ప్రస్తుతం బాలీవుడ్ సినిమా పరిశ్రమలో మంచి క్రేజ్ మరియు ఫాలోయింగ్ తో దూసుకుపోతున్న నటుల్లో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ ముందు వరుసలో ఉంటారు అని చెప్పవచ్చు. గత కొద్దికాలంగా సరైన సక్సెస్ లేక సతమతం అవుతున్న హృతిక్ కు, ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూపర్ 30 సినిమా సూపర్ సక్సెస్ సాధించి ఆయనకు మంచి జోష్ ని ఇచ్చింది. మరోవైపు టైగర్ కూడా మంచి విజయాలతో ఊపు మీద ఉన్నారు. ఇక వీరిద్దరి కలయికలో బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ యాష్ రాజ్ ఫిలిమ్స్ వారు 'వార్' అనే సినిమాను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. 

ఇక ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ కు సూపర్ రెస్పాన్స్ లభించింది. టీజర్ చూసిన ప్రేక్షకులు, సినిమాని ఎప్పుడెప్పుడు థియేటర్లలో చూద్దామా అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది అక్టోబర్ లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ భారీ బడ్జెట్ సినిమా బిజినెస్ కూడా ప్రస్తుతం అదిరిపోయే రేంజిలో జరుగుతున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాను తెలుగులో ఏయే హీరోలు చేస్తే బాగుంటుంది అంటూ కొందరు తెలుగు ప్రేక్షకులు కొద్దిరోజలుగా సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా చర్చించుకుంటున్నారు. అయితే ఈ చర్చలో ఎక్కువమంది సూపర్ స్టార్ మహేష్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అయితే ఆ రెండు పాత్రలకు సరిగ్గా సరిపోతారని అంటున్నారు. 

ఇంచుమించు ఒకే హైట్ మరియు పర్సనాలిటీ కలిగిన ఈ ఇద్దరు స్టార్లు, ఇప్పుడు టాలీవుడ్ ని శాసిస్తున్న స్టార్ హీరోల్లో ముందు వరుసలో ఉంటారు. ఇక ఇంతటి భారీ బడ్జెట్ యాక్షన్ సినిమాని వారిద్దరి కలయికలో తీయాలంటే కేవలం రాజమౌళి వల్లనే వీలవుతుందని ఎక్కువమంది అభిప్రాయపడుతూ తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియా ఖాతాల ద్వారా వ్యక్తపరుస్తున్నారు. అయితే ఇది కేవలం సినిమా లవర్స్ వ్యక్తిగత అభిప్రాయమే, కానీ ఒకవేళ వారు భావిస్తున్నట్లు అదే కనుక జరిగి మహేష్, ప్రభాస్ కలయికలో రాజమౌళి అటువంటి భారీ సినిమాను రూపొందిస్తే, దానికి వచ్చే కలెక్షన్స్ మరింత అత్యద్భుతంగా ఉంటాయి అనడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదంటున్నారు సినిమా విశ్లేషకులు.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: