నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో నందమూరి బాలకృష్ణ.  సీనియర్ ఎన్టీఆర్ వారసుడిగా వచ్చిన బాలకృష్ణ తండ్రికి తగ్గ తనయుడిగా అన్ని రకాల పాత్రల్లో నటించి మెప్పించారు.  అంతే కాదు ఆయన తండ్రి నటించని పాత్రలు కూడా బాలకృష్ణ నటించారు. ఎన్నో ఫ్యాక్షన్ మూవీస్ లో నటించి తనదైన ముద్ర వేశారు బాలకృష్ణ.  అలాంటి బాలయ్యకు నట వారసుడిగా మోక్షజ్ఞ తయారవుతున్నాడని ఇప్పటి వరకు నందమూరి అభిమానులకు ఎంతో ఆశంగా ఉండేది. 


అయితే నందమూరి ఫ్యామిలీ నుంచి ఇప్పటికే జూ.ఎన్టీఆర్, కళ్యాన్ రామ్, తారక్ ఇలా కొంత మంది హీరోలు వచ్చారు.  ప్రస్తుతం టాప్ హీరోల్లో ఒకరిగా ఎన్టీఆర్ కొనసాగుతున్నారు.  అయితే కళ్యాన్ రామ్, ఎన్టీఆర్ లు స్వర్గీయ నందమూరి హరికృష్ణ తనయులు..హరికృష్ణ కూడా కొన్ని సినిమాల్లో నటించి మెప్పించారు.  మరి బాలకృష్ణ నట వారసుడి పరిస్థితి ఏంటీ అని అడిగితే మొన్నటి వరకు వయసు ఇంకా రాలేదని..పై చదువులు చదువుతున్నాడని, నటనలో శిక్షణ తీసుకుంటున్నారని, ఇలా ఎన్నో కథనాలు సోషల్ మీడియాలో వెలువడ్డ విషయం తెలిసిందే. 


ఓ వైపు నందమూరి కుర్రోళ్లు హీరోలుగా నటిస్తూన్నా..వారికి పోటీగా బాలయ్య తన కెరీర్ కొనసాగిస్తున్నారు.  ఏది ఏమైనా ఇది కొంత వరకు మాత్రమే సాగుతుంది.. మరి బాలయ్య తర్వాత ఎవరు అన్న విషయంపై ఇంకా ప్రశ్నలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే మోక్షజ్ఞ హీరోగా వెండి తెరపై చూడాలని ఆశగా ఉన్నా..ఈ కుర్రాడిని చూసినవారు షాక్ కి గురి అవుతున్నారు. 


హైట్ బాగానే ఉన్నా బొద్దుగా ఉండటంతో హీరో లక్షణాలు ఇంకా కనిపించడం లేదని..మరి హీరోగా ఉండాలంటే ఈ కాలంలో సిక్స్ ప్యాక్స్ కావాలి కదా..మనోడు ఆ సిక్స్ ప్యాక్స్ కి ఎప్పుడు వస్తాడు..ఎప్పుడు హీరోగా మారుతాడు అన్న దానిపై నందమూరి అభిమానుల్లో కలవరం మొదలయ్యింది.  ఒకప్పుడు బాలకృష్ణ అలాగే ఉన్నా ఆయన ఛరిష్మా వేరుగా ఉండేది..హీరోగా ఏ పాత్రకైనా చక్కగా కుదిరేవారు. సాంఘిక,పౌరాణిక,జానపద పాత్రల్లో బాలయ్య తనకు తానే సాటి అనిపించుకున్నారు.  మరి బాలయ్య వారసుడిగా మోక్షజ్ఞ ఎప్పుడు తయారవుతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: