తెలుగు, హిందీ, తమిళం ఇలా అన్నీ భాషల్లో ఎంతో పాపులర్ అయిన రియాలిటీ షో బిగ్‌బాస్‌. తెలుగులో రీసెంట్‌గా సీజన్‌ 3 మొదలైందో లేదో ఇంట్లో గొడవలు మొదలయిపోయాయి. ప్రతి ఒక్కరూ కయ్యానికి కాలుదూస్తూ సై అంటే సై అన్నట్టున్నారు. నలుగురైదుగురు తప్ప మిగతా వాళ్లంతా బాగా బర్న్ అవుతు ఎప్పుడు పేలిపోతారో అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. వందరోజుల పాటు కాన్‌ఫ్లిక్టింగ్‌ పర్సనాలిటీస్‌ కలిసి వుండాల్సిన ఇంట్లో అభిప్రాయ బేధాలు రావడం సహజమే. కానీ మరీ ఇలా ఒక్క రోజులో నాలుగైదు సార్లు కొట్టుకునేలా వుంటే షో నిర్వహించడం కష్టమవుతుంది.

ఈ షోలో ఒక నాలుగు వారాలు గడిచిన తర్వాత వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీగా ఒకరిని పంపుతారు. ఫస్ట్‌ సీజన్‌లో నవదీప్‌, అలాగే సెకండ్‌ సీజన్‌లో పూజ రామచంద్రన్‌ వెళ్ళిన విషయం తెలిసిందే. ఈ హౌస్‌లోకి వెళ్లడానికి వైల్డ్‌ కార్డ్‌ క్యాండిడేట్లుగా కాస్త పేరున్న వాళ్లు దొరకడం కష్టమే. ఎందుకంటే దిన దిన గండం అన్నట్టుగా వున్న హౌస్‌లోకి ఏరికోరి ఎవరూ వెళ్లరు. ఎంత పారితోషికం ఇచ్చినా కానీ ఆ రొంపిలోకి ఎవరు దిగరు. అయినప్పటికి స్టార్ మా బృందం బాగానే ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఆ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.

గత ఏడాది కూడా వైల్డ్‌ కార్డ్‌గా కొందరు టాప్‌ సెలబ్రిటీలని అనుకొని ఎవరూ దొరక్క పూజతో సరిపెట్టుకున్నారు. ఈసారి ఆ మాత్రం ఫేం ఉన్న వాళ్లు కూడా వెళ్లడం కష్టమేనేమో. శ్రద్ధాదాస్‌కి ఛాన్స్‌ వుందనే టాక్‌ వినిపిస్తోంది కానీ తను ఆసక్తి చూపించడం లేదట. ఇదిలావుంటే ఈ బ్యాచ్‌కి నాగార్జున ఎలా బుద్ధిచెప్తాడు, ఏ విధంగా ఈ సీజన్‌ని నడిపిస్తాడు అనేది ఇప్పుడు షోలో ఆసక్తికరంగా మారడంతో అంతా వీకెండ్‌ ఎపిసోడ్స్‌ కోసం ఎదురు చూస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: