తమిళంలో బాగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో "విజయ్". ఇలయ దళపతి అనే పేరుతో అభిమానులు ప్రేమగా పిలుచుకునే ఈ హీరో ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో  "బిగిల్"అనే సినిమా చేస్తున్నాడు.  తాజా సమాచారం ప్రకారం ఆగస్టు చివరికల్లా చిత్రీకరణ పూర్తి చేయనున్నారట.దీపావళి కానుకగా విడుదల కానున్న నేపథ్యంలో సెప్టెంబర్ నుండి చిత్ర నిర్మాణాంతర కార్యక్రమాలు మొదలుపెట్టే యోచనలో ఉన్నారు.


గతంలో విజయ్, అట్లీ  కాంబినేషన్ లో వచ్చిన "తెరి", మెర్సల్ సినిమాలు ఎంతటి విజయం సాధించాయో తెలిసిందే. దాంతో ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి.నాలుగు విభిన్న పాత్రలలో విజయ్ నటిస్తున్న ‘బిగిల్’ చిత్రంలో ఒక పాత్రలో లేడీ ఫుట్ బాల్ టీమ్ కోచ్ గా చేస్తున్నారు.కాగా ఈ మూవీ కొరకు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహ్మాన్ స్వరపరచిన ‘సింగే పెన్నేయ్’ అనే ఓ ఇన్స్పిరేషనల్ సాంగ్ యూట్యూబ్ లో ప్రకంపనలు రేపుతోంది.


 యూట్యూబ్ లో విడుదలైన 85గంటల్లోనే ఈ సాంగ్ 7లక్షల లైక్స్ సాధించి రికార్డు సృష్టించింది. విజయ్ తన టీం సభ్యులకు స్ఫూర్తి నింపే నేపథ్యంలో వచ్చే ఈ పాటను రెహ్మాన్ అద్భుతంగా స్వరపరిచారు. ఈ పాటకి వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే సినిమా మీద అంచనాలు మరింతగా పెరిగాయి.మిగతా పాటల మీద ఆసక్తి ఇంకా పెరిగేలా చేసింది ఈ పాట.


బిగిల్ చిత్రంలో విజయ్ కు జోడిగా నయన తార నటిస్తుండగా, జాకీ ష్రాఫ్,ఆనంద్ రాజ్,వివేక్ ఇతర ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై కళాపతి అఘోరం,గణేష్,సురేష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోని నయనతార పాత్ర గుర్తుండిపోయేలా ఉంటుందట. దీపావళి కానుకగా విడుదల అవుతున్న ఈ చిత్రం మెర్సల్ లాంటి విజయాన్ని అందిస్తుందో లేదో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: