బిగ్ బాస్ సీజన్ 3 ముందునుండి వివాదాలను సృష్టిస్తూ వచ్చింది. షో మొదలవ్వకముందే యాంకర్ శ్వేతా రెడ్డి ఈ షోపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయగా ఆ తర్వాత గాయత్రి గుప్త కూడా బిగ్ బాస్ షో మీద సంచలన వ్యాఖ్యలు చేసింది. నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 3 మొదటి వారం పూర్తయింది.


అయితే ఈ సీజన్ లో 15 మంది సెలబ్రిటీస్ కంటెస్టంట్స్ గా ఎంట్రీ ఇవ్వగా మొదటి వారం ఆరుగురు నామినేషన్ లో ఉన్నారు. శనివారం ఎపిసోడ్ లో ఆరుగురిలో ఇద్దరిని సేఫ్ జోన్ లోకి పంపించాడు నాగార్జున. హోస్ట్ గా నాగార్జున తన మార్క్ చూపిస్తున్నా షోకి కావాల్సిన ఎక్సైట్మెంట్.. ఎంటర్టైన్మెంట్ ఇవ్వట్లేదు అన్న టాక్ వస్తుంది.  


అంతేకాదు బిగ్ బాస్ లో నామినేట్ అయిన సభ్యులను సేవ్ చేసేందుకు ఆడియెన్స్ నుండి ఓటింగ్ ప్రక్రియ ఉంటుంది. ముందు రెండు సీజన్లకు ఆడియెన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ రాగా ఈ సీజన్ లో మొదటి వారం ఓటింగ్ పర్సెంటేజ్ కూడా చాలా తక్కువ ఉందని తెలుస్తుంది. అంటే బిగ్ బాస్ చూసేందుకు ఆడియెన్స్ ఇంట్రెస్ట్ చూపించట్లేదని అర్ధమవుతుంది.    


హోస్ట్ గా నాగార్జున కూడా సోసోగానే అనిపిస్తున్నాడు. ఈ వారం మొత్తం కంటెస్టంట్స్ గొడవలు తప్ప ఇంట్రెస్టింగ్ టాస్కులు మాత్రం ఏం చేయలేదు. అందుకే బిగ్ బాస్ సీజన్ 3కి బుల్లితెర ఆడియెన్స్ బిగ్ పంచ్ ఇచ్చారు. తారక్, నాని హోస్ట్ గా చేస్తున్న టైంలో ప్రతి వారం ఎంతమంది ఓట్ వేశారన్న విషయాన్ని కూడా చెప్పేవాడు. ఈసారి తక్కువ వచ్చాయి కాబట్టే నాగార్జున ఆ విషయాన్ని ప్రస్థావించలేదని తెలుస్తుంది. మరి రానున్న రోజుల్లో ఆడియెన్స్ ఓటింగ్ పర్సెంటేజ్ పెరుగుతుందో లేదో చూడాలి.      



మరింత సమాచారం తెలుసుకోండి: