అంటే అవుననే అంటుంది నటి హేమ.  తెలుగు సినిమాల్లో తనదైన కామెడీ మార్క్ చాటుకున్న హేమ ఎప్పుడూ ముక్కుసూటిగా వెళ్లే మనిషి.  మా అసోసియేషన్ ఎన్నికల్లో గతంలో హేమ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీలో ఉండే హేమ తెలుగులో స్టార్ కమెడియన్ బ్రహ్మానందం కాంబినేషన్ లో వచ్చిన ఎన్నో కామెడీ సీన్లు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంటాయి.  ఈ మద్య తెలుగు సినిమాల్లో కాస్త హేమ జోరు తగ్గిందనే చెప్పొచ్చు..ఇటీవల కాలంలో ఆమె వైసీపీ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే.

అయితే త్వరలో తాను పూర్తిస్థాయిలో రాజకీయల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు . రాజమండ్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె ఈ వాఖ్యలు చేసారు. నిమాల్లో తనని ప్రేక్షకులు ఎలా ఆదరించారో బయట కుడా అలాగే ఆదరిస్తారని నమ్ముతున్నానని ఆమె ఆశాభావం వ్యక్తం చేసారు. అలాగని  సినిమాలకి ఇక వీడనున్నట్లు ఆమె తెలిపారు. ప్రస్తుతం హేమా మా అసోసియేషన్ లో కీలక పదవిలో ఉన్నారు. ప్రస్తుతం బుల్లితెరపై వస్తున్న బిగ్ బాస్ సీజన్ 3 లో ఆమె ఇంటి సభ్యురాలిగా వచ్చారు. 

పదిహేను మంది కంటెస్టంట్లు ప్రస్తుతం ఇంటిలో హడావుడి చేస్తున్న తరుణంలో మొట్టమొదటి ఎలిమినేషన్ హేమనే కావడం విశేషం. ఇంటిలోకి వచ్చినప్పటి నుంచి ఇంటి సభ్యులో హేను ఎంతో గౌరవంగా చూడటం మొదలు పెట్టారు..హేమక్కా అంటూ ఆప్యాయంగా పిలుచుకున్నారు. అయితే ఇంటిలో కిచెన్ వద్ద ఏర్పడ్డ గొడవ చిలికి చిలికి గాలివానగా అందరికీ హేమ నెగిటీవ్ అయ్యింది. 

ఇదే విషయాన్ని ఆమె ఎలిమినేషన్ తర్వాత నాగార్జున వద్ద వచ్చి ఆవేదనతో చెప్పింది. తాను ఇంటి సభ్యులను తన పిల్లల్లా చూసుకున్నానని..కిచన్ విషయంలో వచ్చిన గొడవే తనను బ్యాడ్ చేసిందని వాపోయింది.  అయితే ఇంటిలో అందరూ చాలా మంచి వారని..కాకపోతే ఎవరి గేమ్ వారు చాలా సేఫ్ గా ఆడుతున్నారని ఫైనల్ వరకు శ్రీముఖి, బాబా మాస్టర్ ఉండొచ్చని చెప్పింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: