పడి పడి లేచే మనసు డిజాస్టర్ తర్వాత శర్వానంద్ రణరంగం అంటూ సీరియస్ టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్ తో శర్వా లుక్స్ తో బాగా హైప్ ని క్రియోట్ చేసుకుంది. ఇప్పటివరకు చూడని శర్వా లుక్స్ మాస్ ఆడియన్స్ ని బాగా అట్రాక్ట్ చేస్తున్నాయి. ఈ సినిమాలో శర్వానంద్ డ్యూయల్ రోల్ నటిస్తున్న సంగతి కూడా తెలిసిందే. పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ తో యాక్షన్ బ్యాగ్డాప్ లో తెరకెక్కించిన ఈ సినిమాలో రొమాన్స్ ఏముంటుందని చాలామంది అనుకున్నారు. కాని ఇలాంటి సినిమాలో కాస్త రిలీఫ్ ఇవ్వడానికే అన్నట్లు హీరోయిన్ కాజల్ హాట్ లుక్ ఒకటి వచ్చేసింది. 

స్పైసీ లుక్స్, డ్రెస్, డ్యాన్స్ నంబర్ తో పిల్లా పిక్చర్ పెర్ ఫెక్ట్ అంటూ బీచ్ పార్టీ సాంగ్ ఒకటి రణరంగం సినిమా కోసం రూపొందించారు. పక్కా పెప్పీగా వున్న ఈ సాంగ్ సినిమాకు యాడెడ్ అట్రాక్షన్ అవుతుందని లేటెస్ట్ న్యూస్ ఒకటి ఫిల్మ్ నగర్‌లో చక్కర్లు కొడుతోంది. టెంపర్, బిజినెస్ మ్యాన్..వంటి సినిమాల్లో కాజల్ బీచ్ సాంగ్ లో హాట్ గా కనిపించి ప్రేక్షకులను అట్రాక్ట్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అందుకే మళ్ళీ ఈ సాంగ్ తో అందరిని ఆకట్టుకోవడం ఖాయమని తెలుస్తోంది. డైరక్టర్ సుధీర్ వర్మ కు బాగా ఫ్యావరెట్ మ్యూజిక్ డైరక్టర్ అయిన సన్నీ ఎమ్ ఆర్ కంపోజ్ చేసిన సాంగ్ లో బీట్, బీట్ కు తగినట్లే కొరియోగ్రఫీ, కాజల్ డ్రెస్, డ్యాన్స్ మూవ్ మెంట్స్, అన్నీ పక్కాగా మ్యాచ్ అయ్యేలా తెరకెక్కించారు.

ఇప్పటికి రణరంగం సినిమాకు సంబంధించి మూడోసాంగ్. సుధీర్ వర్మ డైరక్షన్ లో సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై నాగవంశీ నిర్మించిన రణరంగం సినిమాలో హీరో శర్వానంద్ రెండు షేడ్స్ లో కనిపిస్తాడు. ఆ రెండు షేడ్స్ లో ఇద్దరు హీరోయిన్లుగా కళ్యాణి ప్రియదర్శన్, కాజల్ నటిస్తున్నారు. ఇక  సినిమా ఆగస్టు 15న విడుదల చేయనున్నారు.
శతమానంభవతి సినిమా తర్వాత శర్వానంద్ కి సరైన హిట్ లేకపోవడంతో ఈ సినిమాపై బోలెడన్ని ఆశలు పెట్టుకున్నాడు. మరి ఈ సినిమా శర్వాకి హిట్టిస్తుందో లేదో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: