దాదాపుగా తన సినిమా హిట్ అని అనిపించుకోడానికి నాలుగు సంవత్సరాలు కష్టపడ్డాడు దర్శకుడు పూరి జగన్నాథ్. ఇస్మార్ట్ శంకర్ హిట్ క్రెడిట్ మొత్తం పూరి ఖాతాలో పడ్డదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. రామ్ ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ సినిమాకు ప్లస్ అయినా పూరి మార్క్ మూవీగా ఈ సినిమా సూపర్ హిట్ కొట్టింది. టెంపర్ తర్వాత పూరికి హిట్ జోష్ తెచ్చింది ఇస్మార్ట్ శంకర్. 


సినిమా టాక్ సూపర్ పాజిటివ్ గా ఉండగా.. వసూళ్లు కూడా అదరగొడుతున్నాయి. రామ్ కెరియర్ లో హయ్యెస్ట్ కలక్షన్స్ వసూళు చేసిన సినిమాగా ఇస్మార్ట్ శంకర్ టాప్ ప్లేస్ లో ఉంది. అయితే పూరి ఇస్మార్ట్ శంకర్ సూపర్ హిట్ అని తెలియగానే డబుల్ ఇస్మార్ట్ శంకర్ అంటూ ఓ సినిమా ఎనౌన్స్ చేశాడు. అయితే కెరియర్ లో ఎప్పుడు లేని ఊర మాస్ పాత్ర చేసిన రామ్ మరోసారి అలాంటి పాత్ర చేస్తాడా అన్న డౌట్ మొదలైంది.   


అంతేకాదు సినిమా రిలీజ్ తర్వాత పూరి, చార్మి చేసే ఓవరాక్షన్ రామ్ కు నచ్చట్లేదని టాక్. అసలైతే పూరి తన తర్వాత సినిమా విజయ్ దేవరకొండతో ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తుంది. కరెక్ట్ కథ పడితే విజయ్ సినిమాతో కూడా పూరి మరో బ్లాక్ బస్టర్ కొట్టే అవకాశం ఉంది. కాని పూరి ఇస్మార్ట్ హిట్ కొట్టిన ఉత్సాహంలో ఎక్సైట్ అవుతున్నాడు.  


ఇక తనకు స్టార్ అవకాశాలు కూడా వస్తాయని చెబుతున్నాడు. ఆల్రెడీ స్టార్ హీరోలంతా తమ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇస్మార్ట్ శంకర్ హిట్ కొట్టాడు కదా అని పూరితో సినిమాలు చేసే వీలు లేదు. చరణ్, ప్రభాస్ ఇప్పటికే ఇస్మార్ట్ హిట్ కొట్టడంతో పూరికి ఫోన్ చేసి తమ విశెష్ చెప్పారట. మరి వీళ్లు సినిమా ఛాన్సులు ఇస్తారో లేదో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: