మాట‌ల మాంత్రికుడు తివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ , అల్లు అర్జున్ కాంబినేష‌న్ లో వ‌రుస‌గా రెండు హిట్‌లు వ‌చ్చాయి.. జులాయి, స‌న్ ఆఫ్ స‌త్య‌మూర్తి ఈ రెండు సినిమాలు బాక్సాఫీసు బ‌ద్ద‌లు కొట్టాయి.. అల్లు అర్జున్ కు స్టార్ ఇమేజ్‌ను తీసుకొచ్చాయి... వ‌రుస హిట్‌ల‌తో మంచి జోష్ మీద ఉన్న అల్లు అర్జున్ కు 2018 లో  రిలీజు అయిన నా పేరు సూర్య నిరుత్సాహ ప‌రిచింది.. దాంతో గ్యాప్ తీసుకున్నాడు అర్జున్‌.. ఇపుడు మ‌ళ్ళీ తివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ దర్శ‌క‌త్వంలో అల్లుఅర్జున్‌ త‌న 19 వ సినిమా పూజా కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుని షూటింగ్ లో ఉన్నాడు.. త్రివిక్ర‌మ్ సినిమా అంటే ఎలా ఉంటుందో ప్రేక్ష‌కుల‌కు ఓ క్లారిటీ ఉంది. ఆయ‌న సినిమాల్లో ఎలాంటి క‌థ‌లు ఉంటాయో కూడా వాళ్లు ఊహించ‌గ‌ల‌రు.ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా న‌టిస్తున్న‌ది... తివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో మూడో సినిమా హిట్ కొట్టి హాట్రిక్ కొడ‌దామ‌నే ఉద్దేశ్యంలో ఉన్న‌ట్టు క‌నిపిస్తున్నారు.. ఈసినిమా ఫ‌స్ట్ లుక్ ఆగ‌ష్టు 15న రిలీజు చేద్దామ‌ని అనుకుంటున్న‌ట్టు ఫిలిం వ‌ర్గాలలో టాక్‌...


గ‌తంలో అల్లుఅర్జున్, పూజా హెగ్డే క‌లిసి న‌టించిన దువ్వాడ జ‌గ‌న్నాధ‌మ్ (డి.జె). ఆశించినంత ఫ‌లితం రాలేదు కాని  వీరిద్ద‌రి పెయిర్ మాత్రం చూడ్డానికి ప్రేక్ష‌కుల‌ని ఆక‌ట్టుకుంద‌నే చెప్పాలి. ఆ త‌ర్వాత పూజా న‌టించిన చిత్రాల్లో ఎన్టీఆర్‌తో అర‌వింద స‌మేత‌, మ‌హేష్‌తో మ‌హ‌ర్షి కొంత వ‌ర‌కు హిట్ల‌నే చెప్పాలి. మ‌రి ఇక చాలా గ్యాప్ త‌ర్వాత సినిమా చేస్తున్న అల్లుఅర్జున్‌కి ఈ భామ ల‌క్ ఎంత వ‌ర‌కు క‌లిసొస్తుందో చూడాలి.


 ఇక‌పోతే ఈ కొత్త సినిమాను నాన్న నేను అనే టైటిల్ దాదాపుగా ఖరారైందని... ఇందుకు త్రివిక్రమ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఫిల్మ్ సర్కిల్స్‌లో పుకార్లు షికారు చేస్తున్నాయి. కథకు తగ్గట్టుగా ఉండటం వల్లే ఈ టైటిల్‌కు మాటల మాంత్రికుడు ఓకే చేశారని అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: