టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో ముందుండే వారిలో ప్రప్రథమంగా ఉంటారు జూనియర్ ఎన్టీఆర్. మొన్నటి వరకు టెంపర్ సినిమా రాకముందు వరకు వరుస పరాజయాలు అందుకున్న జూనియర్ ఎన్టీఆర్ టెంపర్ తర్వాత వరుస బ్లాక్ బస్టర్ లు అందుకుంటూ టాలీవుడ్ ఇండస్ట్రీలో బాక్స్ ఆఫీస్ దగ్గర గతంలో మాదిరిగా తన స్టామినా ఏంటో నిరూపిస్తున్నాడు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ఒప్పుకున్న ప్రాజెక్టులు గురించి వస్తున్న వార్తలు విని ఇండస్ట్రీలో ఉన్న చాలామంది స్టార్ హీరోల గుండెల్లో భయం పట్టుకున్నట్లు వార్తలు వినబడుతున్నాయి.


ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో నటిస్తున్న తర్వాత కే జి ఎఫ్ డైరెక్టర్ తో పాటు అలాగే కొరటాల శివ డైరెక్షన్ లో ఇలా సెన్సేషనల్ మాస్ పల్స్ తెలిసిన డైరెక్టర్లతో జూనియర్ ఎన్టీఆర్ ప్రాజెక్టులు ఒప్పుకోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది. ఇదంతా ఒకెత్తయితే ఒకపక్క సినిమా రంగంలో రాణిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ గతంలో టెలివిజన్ రంగంలో బిగ్ బాస్ సీజన్ మొదటి భాగంలో హోస్ట్ గా చేసిన కార్యక్రమాలు ఇప్పటికీ కూడా ఎవరూ మర్చిపోలేరు. రెండవ సీజన్ లో హోస్ట్ గా వ్యవహరించిన నాని ...జూనియర్ ఎన్టీఆర్ యాంకరింగ్ ముందు సరిగ్గా పని చేయలేకపోయారు.


అయితే ప్రస్తుతం మూడవ సీజన్ కి హోస్ట్ గా నాగార్జున వ్యవహరిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ అంత మాదిరిగా నాగార్జున గారు రాణించలేకపోతున్నారు బిగ్ బాస్ షో చూస్తున్న చాలామంది టెలివిజన్ ప్రేక్షకులు కామెంట్లు చేస్తున్నారు. మొత్తంమీద చూసుకుంటే యాంకరింగ్ లో బిగ్ బాస్ హౌస్ లో ఎంతమంది వచ్చినా కానీ  ఎన్టీఅరే నెంబర్ 1 అని అంటున్నారు. మరోపక్క సోషల్ మీడియాలో బిగ్ బాస్ మూడవ సీజన్ నాగార్జున యాంకరింగ్ పై ఎన్టీఆర్‌ మాదిరిగా ఒక దీక్షలా దీనిని హోస్ట్‌ చేయకపోతే నాని మాదిరిగా నాగార్జున కూడా ముందు ముందు సోషల్‌ మీడియా హీట్‌ ఎదుర్కొంటాడని విశ్లేషకులు భావిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: