ఎంతో క్రేజ్ తో భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా డియర్ కామ్రేడ్. ఒకవారం ముందుగా రిలీజైన ఇస్మార్ట్ శంకర్ కలెక్షన్ల సునామీని సృష్టిస్తుండగా ఆ సునామీని ఆపాలనే డియర్ కామ్రేడ్ థియోటర్స్ లోకి వచ్చాడు. అయితే మిక్డ్స్ టాక్ తెచ్చుకున్న 'డియర్ కామ్రేడ్' అనుకున్నంత హైప్ రానేలేదు కదా యావరేజ్ టాక్ కూడా తెచ్చుకోలేకపోయింది. తెలుగులో ఇలా ఉంటే ఇప్పుడు బాలీవుడ్ వెర్షన్ కథేంటి? అనేది ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాను తను రీమేక్ చేయబోతున్నట్టుగా కరణ్ జోహార్ ప్రకటించారు. విడుదలకు ముందే ఆ ప్రకటన చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అది చూసిన ప్రేక్షకులు విజయ్ దేవరకొండ తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ 'అర్జున్ రెడ్డి' బాలీవుడ్ రీమేక్ కబీర్ సింగ్ సాధించిన విజయాన్ని చూసి కరణ్ ఆ ప్రకటన చేసి ఉండొచ్చునని అనుకున్నారు.

అయితే 'డియర్ కామ్రేడ్'కు వస్తున్న టాక్ మాత్రం వేరే రకంగా ఉంది. ఎక్కడా కూడా ఈ సినిమా హిట్, చాలా బావుంది అన్న మాట వినిపించలేదు. మరి ఇప్పుడు కూడా ఈ సినిమాను కరణ్ రీమేక్ చేస్తాడా? అనేది ఇండస్ట్రీలో చర్చనీయాంశం అవుతుంది. ఇందుకు సంబంధించిన ఊహాగానాలు కూడా కొనసాగుతూ ఉన్నాయి. ఈ సినిమా హిందీ వెర్షన్లో కూడా విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తాడని ఒక ప్రచారం సాగుతూ ఉంది. అయితే అందుకు అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. 

మరోవైపు ఈ సినిమా హిందీ వెర్షన్లో 'ధడక్' పెయిర్ ఇషాన్-జాన్వీలు నటిస్తారనే ప్రచారం కూడా జోరుగా సాగింది. అయితే ఆ ప్రచారానికి కరణ్ జొహార్ ఫుల్ స్టాప్ పెట్టాడు. మరి ఇంతకీ 'డియర్ కామ్రేడ్' రీమేక్ అవుతుందా? లేక సౌత్ లాంగ్వేజ్ లలో వచ్చిన రెస్పాన్స్ తో హిందీలోకి డబ్బింగ్ మాత్రమే ఉంటుందా? అనేవి ప్రస్తుతానికి ప్రశ్నలుగానే ఉన్నాయి. అయితే ఈ సినిమా కోసం విజయ్ ఎంత కష్టపడ్డాడో అందరికీ తెలిసిందే. కాని ఫలితం చూసిన తర్వాత విజయ్ కొంత నిరాశలో పడినట్లు సమాచారం. ఇక మరోపక్క విజయ్ నటించాల్సిన హీరో సినిమాకి బడ్జెట్ పెరగడం వల్ల ఆ సినిమా ఆగిపోయిందన్న మరో వార్త కొన్ని రోజులుగా హల్ చల్ చేస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: