అక్కడున్నది బిగ్ బాస్.. ఆయన ఏమనుకుంటే అది చేస్తాడు. అడ్డూ అదుపు అనేది ఉండదు. మనకు నచ్చింది అక్కడ చేయడు.. బిగ్ బాస్ తన మనసుకు నచ్చింది మాత్రమే చేస్తూ వెళ్తుంటాడు. ఊహకు కూడా అందని ట్విస్టులతో సాగిపోతుంది బిగ్ బాస్ సీజన్ 3.

ఇక తాజాగా విడుదలైన ప్రోమోలో మరో ఆసక్తికరమైన విజువల్ వచ్చింది. ఈ సారి శ్రీముఖిని టార్గెట్ చేసాడు బిగ్ బాస్. ఆమెతో పాటు అలీ రెజా కూడా బుక్ అయ్యాడు. ఈ ఇద్దర్నీ ఏకంగా 100 పిడకలు కొట్టాలంటూ ఆదేశించాడు. దీనికి ముందు సైక్లింగ్ కూడా పెట్టాడు బిగ్ బాస్. 


ఒకటి కరెంట్ కోసం.. మరోటి గ్యాస్.. ఇంకోటి నీటి కోసం ఈ సైక్లింగ్ పోటీ పెట్టాడు బిగ్ బాస్. అక్కడ తొక్కితేనే ఇక్కడ ఇవన్నీ వస్తాయి లేదంటే లేదు. అది నడుస్తుండగానే ఇప్పుడు మరో టాస్క్ ఇచ్చాడు శ్రీముఖికి. ఈమె 100 పిడకలు కొట్టాలని చెప్పేసరికి షాక్ అయిపోయింది. అయినా తప్పదు కదా.. బిగ్ బాస్ ఇంట్లో ఉన్నపుడు ఇవన్నీ కామన్. పైగా నామినేషన్స్‌లో కూడా టాప్‌లో ఉంది శ్రీముఖి. ఆమెను వీలైనంత త్వరగా పంపేయాలని డిసైడ్ అయిపోయారు ఇంటి సభ్యులు. ఆమెకు తెలియకుండానే శ్రీముఖిపై చాలా కుట్రలు చేస్తున్నారు అక్కడ. మరి చూడాలిక.. ఈ పిడకల యవ్వారం ఏందో..? 


ఇప్పడికే హేమ ఎలిమినేషన్ తో మంచి రసవత్తరంగా మరీనా బిగ్ బాస్ సీజన్లో 3 లో, నిర్వాహకులు ఇలాంటి మరిన్ని ఆసక్తికర టాస్కులతో ఆడియన్స్ ని అట్ట్రాక్ట్ చెయ్యాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. సోషల్ మీడియా లో రెజినా మరో ప్రచారం ఏంటంటే, ఈ సైక్లింగ్ టాస్క్ మొత్తం 'బ్లాక్ మిర్రిర్' అనే హాలీవుడ్ షో నుంచి కాపీ కొట్టారని కొందరు అంటున్నారు. మరి చూడాలి, ఇంకెన్ని వెరైటీ టాస్కులతో వస్తారో?





మరింత సమాచారం తెలుసుకోండి: