ఈ డైలాగ్ లారెన్స్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రబాస్ కొట్టేది.  సీరియస్ గా రౌడీలతో దెబ్బలు తిన్న ప్రభాస్ చివరిగా రెబల్ టైమ్ స్టార్ట్ నౌ.. అంటూ వాళ్లను చితక బాదుతాడు.  ఇప్పుడు కూడా రెబల్ టైమ్ స్టార్ట్ అయ్యిందన్నట్లే ఉంది..ఎందుకంటే కొన్ని రోజులుగా ప్రభాస్ నటించిన ‘సాహూ’ మూవీ లేటేస్ట్ అప్ డేట్స్ వరుసగా ఇస్తున్నారు.  ఇప్పటికలే కొత్త పోస్టర్లతో సినిమాపై అంచనాలు పెంచుతుంటే..లిరికల్ టీజర్ సాంగ్స్ కూడా రిలీజ్ చేస్తున్నారు. 


తాజాగా సాహూ మూవీ నుంచి మరో లేటెస్ట్ యాక్షన్ ఇంట్రెస్టింగ్ పోస్టర్ రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.  పోలీస్ ఎన్‌కౌంటర్ సీన్ ప్రభాస్ పెట్టుకున్న కళ్లజోడులో కనిపించడం కొత్తగా అనిపిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్లు, స్టిల్స్, పిక్స్, తొలి పాట సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. ఆ మద్య చూపించిన టీజర్ బట్టి చూస్తే ఈ మూవీలో ప్రభాస్ స్పెషల్ ఇన్వేస్టిగేషన్ తో స్పెషల్ పోలీస్ ఆఫీసర్ లా కనిపిస్తున్నాడు.  ఇక ఈ మూవీలో యాక్షన్ సీన్ల కోసం హాలీవుడ్ స్టంట్ మాస్టర్లు వర్క్ చేసిన విషయం తెలిసిందే. 


ప్రతి ఒక్క ఫైట్ సీన్ కన్నార్పకుండా చూడాల్సిందే అట. కాగా,  ఈ సినిమా దర్శకుడు సుజిత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులతో పాటు గ్రాఫిక్స్ వర్క్స్ జరుగుతున్నాయి. తెలుగుతో పాటు తమిళ, హిందీలోనూ ఈ చిత్రాన్ని ఆగస్టు 30న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 


మొదటి నుంచి ఈ మూవీపై ఎన్నో రకాల వార్తలు వస్తున్నా.. వాటన్నింటికి చెక్ పెడుతూ కొత్త పోస్టర్లతో ఆకట్టుకుంటున్నారు. ప్రభాస్ సరసన శద్ధా కపూర్ నటిస్తున్నారు. వి.వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, భూషణ్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.  వాస్తవానికి ఈ మూవీ ఆగస్ట్ 15న రిలీజ్ కవాల్సి ఉంది. కానీ కొన్ని టెక్నికల్ కారణాల వల్ల ఆగస్టు 30న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: