నటుడు, రచయిత, సినీ దర్శకుడు, రాజకీయ నేత పోసాని మురళీకృష్ణ ఆరోగ్యంపై అనేక రకాల వార్తలు వెలువడ్డాయి. ఓ దశలో ఆయన ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించిందన్న వార్తలు షికారు చేశాయి. దాంతో మీడియాలో, సినీ, రాజకీయ వర్గాలు ఆందోళనకు గురయ్యాయి. తాజాగా తన ఆరోగ్యంపై వస్తున్న వార్తలు, అసత్య ప్రచారాలపై క్లారిటీ ఇవ్వడానికి పోసాని బుధవారం మీడియాతో మాట్లాడారు.


నేను ఇండస్ట్రీకి వచ్చి 33 ఏళ్లు. ఎన్నోసార్లు నాకు అండగా నిలిచారు. నా అభిప్రాయాలను ప్రజలతో షేర్ చేసుకోవడానికి చాలా ఉపయోగపడింది. మరోసారి మీడియా సహాయం తీసుకోవాలని ఈ ప్రెస్‌మీట్ పెట్టాను. మే 13 తారీఖున నా ఆరోగ్యం క్షీణించింది. రకరకాల పరీక్షలు జరిపినా నాకు ఆరోగ్యం మెరుగుపడలేదు. దాంతో మీడియాకు దూరంగా ఉన్నాను అని పోసాని పేర్కొన్నారు.


నా ఆరోగ్యం సహకరించకపోవడంతో హాస్పిటల్‌లో చేరాను. అక్కడ నాకు హెర్నియా ఆపరేషన్ జరిగింది. ఆ తర్వాత నాకు ఇన్‌ఫెక్షన్ సొకింది. నాకు సోకిన ఇన్‌ఫెక్షన్‌ను ఎవరూ గుర్తించలేదు. విపరీతంగా జ్వరంతో బాధపడ్డాను. ప్రతీ రోజు 104 నుంచి 106 డిగ్రీల జ్వరం వచ్చేది. ఇంజెక్షన్ ఇస్తే తగ్గేది. ఆ తర్వాత యధావిధిగా మారిపోయింది. దాదాపు రెండు నెలలపాటు ఈ బాధని అనుభవించానని చెప్పాడు.


ఒక  దశలో నేను చనిపోతానేమో బయపడ్డాను. మళ్లీ యశోదాలో చేరాను.  ప్రముఖ వైద్యుడు రావు గారికి ఫోన్ చేస్తే ఆ సమయంలో లండన్‌లో ఉన్నాడు. గతంలో కేసీఆర్‌కు ఆయనే  చికిత్స చేశారు. ఈ నేపథ్యంలో నాకు జ్వరం అనగానే ఆందోళనకు లోనై వెంటనే హైదరాబాద్ వచ్చారు. పరీక్షలు చేసిన తర్వాత నాలో ఇన్‌ఫెక్షన్‌ను గుర్తించి గంటలోపే సర్జరీ చేశారు. లేకపోతే నేనెపుడో చనిపోయేవాడిని అన్నాడు. ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని,మీడియాలో అసత్య వార్తలు రాయవద్దని కోరాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: