తెలుగులో వంద చిత్రాలకు పైగా దర్శకత్వం వహించి దర్శకేంద్రుడిగా ఎదిగిన రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాష్ కోవెలమూడి తన వివాహ బంధానికి స్వస్తి పలికాడు. ప్రకాష్ కోవెలమూడి తెలుగులో "అనగనగా ఓ ధీరుడు", "సైజ్ జీరో" వంటిచిత్రాలకు దర్శకత్వం వహించాడు.తాజాగా ఆయన దర్శకత్వం వహించిన "జడ్జిమెంటల్ హై క్యా" సినిమా థియేటర్లలో ఉంది.


అయితే ఈ "జడ్జిమెంటల్ హై క్యా" సినిమాకు రైటర్ గా పనిచేసిన కనికా ధిల్లాన్ తో 2014 లో ప్రకాష్  వివాహం జరిగింది. రెండు సంవత్సరాల కాపురం తర్వాత వీరిద్దరు తమ వివాహ బంధానికి స్వస్తి పలికారు. కానీ ఆ విషయం ఇప్పటివరకు బయట పెట్టలేదు. జడ్జ్ మెంటల్ హై క్యా సినిమా షూటింగ్ లో ఉండగా  విడిపోయారని అనుకున్నారు. కానీ తాజా సమాచారం ప్రకారం ఆ సినిమా కంటే ముందే వాళ్ళు విడిపోయారని చెప్పారు.


అయితే వాళ్ళు విడిపోవడానికి కారణం మాత్రం చెప్పలేదు. ప్రకాష్ మాట్లాడుతూ నేను హైదరాబాదులో ఉంటున్నాను. కనిక రెండు సంవత్సరాల క్రితం ముంబయి వచ్చేసింది అని చెప్పగానే కనిక ఇంటర్ ఫియర్ అవుతూ అదంతా చిన్న విషయమే. దానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన పని లేదు. ఇప్పటికి మేం మంచి స్నేహితులం. అన్ని ఆలోచించాకే నిర్ణయం తీసుకున్నామని చెప్పింది.


కనిక వ్యవహారాన్ని చూస్తుంటే విడిపోవడానికి గల కారణాన్ని ఎవ్వరితో పంచుకోవడానికి ఇష్టం లేదని తెలుస్తుంది. అయితే మీరు మళ్ళి కలిసి పని చేస్తారా అనే ప్రశ్నకి  "అఫ్ కోర్స్" మంచి ఐడియాతో వస్తే తప్పకుండా చేస్తాం. జడ్జిమెంటల్ హై క్యా విషయంలో అలానే జరిగింది అని చెప్పింది. కంగనా రనౌత్ , రాజ్ కుమార్ నటించిన జడ్జిమెంటల్ హై క్యా చిత్రాన్ని ఏక్తా కపూర్, శోభాకపూర్, శైలేష్ సింగ్ నిర్మించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: