ఈనెలలో ప్రేక్షకులలో మంచి హైప్ సంపాదించిన ఐదు సినిమాలు రిలీజ్ కానున్నాయి. వాటిలో ముందుగా కింగ్ నాగార్జున హీరోగా నటించిన మన్మధుడు2 సినిమా ఈనెల 9న రిలీజ్ కానుండగా, స్వతంత్ర దినోత్సవ కానుకగా 15వ తేదీన అడివి శేష్ ఎవరు, శర్వానంద్ రణరంగం, అలానే 30వ తేదీన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందిన సాహో, నాచురల్ స్టార్ నాని గ్యాంగ్ లీడర్ లు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. అయితే ఇందులో మొదట ప్రభాస్ సాహోను 15వ తేదీన విడుదల చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది, 

దానితో మన్మధుడు సినిమా నిర్మాతలు ఆ సినిమా ప్రభావం కొంతైనా తమ మీద పడుతుందని లోలోపల మధనపడ్డట్లు మొన్నటివరకు వార్తలు హల్ చల్ చేసాయి. అయితే సడన్ గా ఉన్నట్లుండి తమ సినిమాకు క్వాలిటీ విషయమై ఎక్కడా రాజీ పడకూదడదని భావించి, మరొక పదిహేనురోజులు వాయిదా వేసి ఈనెల 30వ తేదీన సాహోను రిలీజ్ చేస్తున్నట్లు ఆ సినిమా నిర్మాతలు ఒక ప్రకటన చేసారు. ఇక దానితో మన్మధుడు సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయింది. అయితే సాహోను 30న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తుండడంతో, అప్పటికే 30వ తేదీన రిలీజ్ కి ప్లాన్ చేసిన నాని గ్యాంగ్ లీడర్ మూవీ పై చాలావరకు ఆ సినిమా ప్రభావం పడేలా ఉంది. అయినప్పటికీ గ్యాంగ్ లీడర్ నిర్మాతలు మాత్రం తమ సినిమా రిలీజ్ విషయమై వెనుకడుగు వేసేది లేదని, అదే తేదీని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. 

దీన్నిబట్టి అత్యంత భారీ బడ్జెట్ తో భారీ స్థాయిలో రిలీజ్ అవుతున్న సాహో కనుక బాగుంది అనే టాక్ సంపాదిస్తే చాలు అది గ్యాంగ్ లీడర్ కు చాలావరకు దెబ్బకొడుంటుందని అంటున్నారు కొందరు విశ్లేషకులు. అలాగని గ్యాంగ్ లీడర్ సినిమాను తీసేయడం లేదని, కానీ బాహుబలి రెండు భాగాల అద్భుత విజయాల తరువాత విపరీతమైన హైప్ తో వస్తున్న సినిమా కాబట్టి, ముందుకుగా సాహోనే ప్రేక్షకుల ఫస్ట్ ఛాయస్ గా ఉంటుందనేది వారు అంటున్న మాట. మరి 30వ తేదీన రెండు సినిమాల విషయమై ఏమి జరుగుతుందో, లేక ఒకవేళ ఈ మధ్యలోనే గ్యాంగ్ లీడర్ నిర్మాతలు మనసు మార్చుకుని తమ సినిమాను మరింత వాయిదా వేస్తారేమో అనే వాటిపై క్లారిటీ రావాలంటే మాత్రం మరికొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.....!!  


మరింత సమాచారం తెలుసుకోండి: