మెగా బ్రదర్స్ లో రియల్ యముడు ఉన్నాడట, తన యముని పర్ ఫార్మెన్స్ ఏంటో చూపిస్తాను అంటూ వచ్చేస్తున్నాడట, ఈ విషయం తెలిసినప్పటి నుంచి సినిమా వర్గాల్లో ఆ బ్రదర్ యముని అవతారం ఎప్పుడు చూస్తామా అంటూ ఆసక్తి నెలకొంది. ఇప్పటి వరకు యముని ముఖ్యపాత్రలో వచ్చిన సినిమాలు హిట్టు అయ్యాయి. టాలీవుడ్ పాత కాలంలో యముని పాత్రలో జీవించి నటించిన కైకాల సత్యనారాయణ అందరి మన్ననలు పొందారు. అతర్వాత ఎందరో ఈ పాత్రలను పోషించాడు. యమదొంగలో మోహన్ బాబు కూడా యముని పాత్ర పోషించారు. అయితే యముని పాత్ర కు ఉన్న అభిప్రాయాన్ని బట్టి ఆకారం, గాంభీర్యం ఆనాడు కైకాలలో ఉంటే నేడు టాలీవుడ్ లో ఆయనను మరిపించే విదంగా చేయగల ఏకైక నటుడు మెగా బ్రదర్స్ లోనే ఉన్నాడంటున్నారు. ఇక చెప్పకున్నా.. ఆయనెవరో అర్థం అయ్యే ఉంటుంది, ఇంకెవరు నాగబాబు. త్వరలోనే ‘నేడే చూడండి’ అన్న సినిమా ద్వారా యముని పాత్రలో టాలీవుడ్ ను రంజింప చేసేందుకు వస్తున్నాడంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: