రాజమౌళి డైరక్షన్ లో ఎన్.టి.ఆర్, రాం చరణ్ కలిసి చేస్తున్న మెగా మల్టీస్టారర్ మూవీ ఆర్.ఆర్.ఆర్. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా 400 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు పాత్రల్లో తారక్, చరణ్ నటిస్తున్నారు. 2020 జూలై 30 రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమాకు పోటీగా ఓ కన్నడ సినిమా రాబోతుంది.


ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో యశ్ హీరోగా వచ్చిన సినిమా కె.జి.ఎఫ్. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, హింది భాషల్లో సూపర్ హిట్ అయ్యింది. ప్రస్తుతం కె.జి.ఎఫ్ చాప్టర్ 2 సెట్స్ మీద ఉంది. బాలీవుడ్ యాక్షన్ హీరో సంజయ్ దత్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు.


కె.జి.ఎఫ్ చాప్టర్ 2 సినిమాను కూడా 2020 సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. అయితే సినిమాలో తెలుగు ప్రముఖ నటుడు కూడా ఓ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడని తెలుస్తుంది. సో వీరంతా కలిసి నటిస్తున్నారు కాబట్టి సినిమాపై మరింత అంచనాలు పెరిగాయి. అంతేకాదు ఆర్.ఆర్.ఆర్ కు పోటీగా కె.జి.ఎఫ్ చాప్టర్ 2ని రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట.   


రాజమౌళితో పోటీ పడేంత ధైర్యం ఉందా అనుకోవచ్చు. ఒకవేళ అదే జరిగితే పోటీ రసవత్తరంగా మారుతుంది. ఆర్.ఆర్.ఆర్ సినిమాతో మరోసారి తన సత్తా చాటాలని చూస్తున్నారు రాజమౌళి. ఆర్.ఆర్.ఆర్ తో కె.జి.ఎఫ్ చాప్టర్ పోటీ పడటం హాట్ న్యూస్ గా మారింది. రెండు క్రేజీ ప్రాజెక్టులు కావడం వల్ల రెండిటిపై భారీ అంచనాలు ఉన్నా.. రాజమౌళితో పోటీ అంటే అది రిస్క్ అన్నట్టే లెక్క అని కొందరు చెబుతున్నారు. ఏది ఏమైనా 2020 ప్రేక్షకులకు కన్నుల పండుగగా భారీ సినిమాలు వస్తున్నాయి.   
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: