బాలక్రిష్ణ వేయని పాత్రలు లేవు. పల్లెటూరు పంచె కట్టు నుంచి దుబాయ్ షేక్ వరకూ అన్ని రకాల క్యారక్టర్లను ఆయన వేశారు. ఇక సాంఘికాలతో పాటు, పౌరాణికాలు, జానపదాలు కూడా చేసి ఆల్ రౌండర్  అనిపించుకున్నారు. బాలయ్య కెరీర్లో అటు నుంచి ఇటు తరం డైరెక్టర్లను చూశారు, ఎంతో మంది హీరోయిన్లను చూశారు. తండ్రి  వారసత్వం పుణికిపుచ్చుకుని టాలీవుడ్లో  టాప్ స్టార్ అయ్యాడు. 


అటువంటి బాలయ్య లాయర్ పాత్ర కూడా ఎపుడో వేశారు. 1992 ప్రాంతంలో వచ్చిన ధర్మ క్షేత్రం మూవీలో బాలయ్య లాయర్ గా అదరగొట్టాడు. అందులో కోర్ట్ సీన్లో బాలయ్య అభినయం టాప్ రేంజిలో ఉంటుంది. ఆ సినిమా హిట్ కాలేదు, దాంతో బాలయ్య మళ్ళీ లాయర్ కోటు తొడగలేదు, దాంతో  ఆయన ఎన్ని రకాల వేషాలు వేసినా కూడా లాయర్ జోలికి పోలేదు. ఇపుడు ఆ నల్లకోటును బాలయ్య చేత తొడిగించాలని ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ తెగ ఆశ పడుతున్నారు.


రెండు దశాబ్దాల సినీ జీవితంలో ఎన్నో సూపర్ హిట్లు ఇచ్చారు. అందరు టాప్ స్టార్లతో పనిచేశారు. అయితే బాలయ్య, చిరంజీవిలతో మాత్రం ఆయన సినిమాలు తీయలేదు. సరైన కధలు దొరికితే వారితో కూడా మూవీస్ తీసి టాప్ టు బాటం మూవీస్ చేశారని అనిపించుకోవాలన్నది దిల్ రాజు కోరిక.  ఇపుడు ఆ రోజు దగ్గరలోనే ఉందిట. బాలయ్యని హీరోగా పెట్టి లాయర్ సాబ్ సినిమా తీయాలని అనుకుంటున్నారుట.


ఈ మూవీ బాలీవుడ్ కి రీమేక్. బాలయ్య  లాంటి సీనియర్ హీరో చేయాల్సిన పాత్రట. దాంతో బాలయ్య కాల్షీట్ల కోసం దిల్ రాజు చూస్తున్నారు. బాలయ్య సైతం మంచి స్టోరీ, నిర్మాత దొరికితే రెడీ అంటున్నారు. దాంతో ఈ కాంబో తొందరలోనే పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. సో నందమూరి ఫ్యాన్స్ కి తొందరలొనే గుడ్ న్యూస్ వస్తుందన్న మాట. ఈ మూవీలో సెటిల్డ్ పర్ఫార్మెన్స్ తో బాలయ్య మరో మెట్టు ఎక్కే నటనను చూపిస్తాడని అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: