వరుస ఫ్లాపులతో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ 'టెంపర్' సినిమా నుండి బాక్సాఫీస్ దగ్గర పరాజయం లేకుండా దూసుకుపోతున్నాడు. మొత్తం మాస్ సబ్జెక్టులనే సెలెక్ట్ చేసుకుంటూ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ తన క్రేజ్ కి తగ్గ విధంగా అభిమానులకు నచ్చే విధంగా స్టోరీలను ఏంచుకుంటున్నాడు. ప్రస్తుతం దగ్గర దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ తో కలిసి 'RRR' సినిమా చేస్తున్న విషయం మనకందరికీ తెలిసినదే. దాదాపు ఈ సినిమా కోసం సంవత్సరం వరకు ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలోనే పనిచేస్తున్నాడట. దీంతో ఇప్పుడప్పుడే ఎన్టీఆర్ డేట్స్ కూడా ఖాళీగా లేవు.


అయినా కానీ జూనియర్ ఎన్టీఆర్ పక్కా ప్లాన్ తో తాజాగా ఇటీవల మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఫిలిం నగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన 'అరవింద సమేత వీర రాఘవ' అదిరిపోయే హిట్ కొట్టింది బాక్స్ ఆఫీస్ దగ్గర. దీంతో ఇప్పుడు మరొకసారి ఇటీవల మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఓ భారీ ప్రాజెక్టుకు సంబంధించి చిన్న లైన్ ఎన్టీఆర్ కి వినిపించాడట. అయితే ఆ లైన్ ఎంతగానో ఎన్టీఆర్ కి నచ్చడంతో వెంటనే స్టోరీ రెడీ చేయమని ఫుల్ స్టోరీ విన్నాక ప్రాజెక్టు ఓకే చేద్దామని ఎన్టీఆర్ త్రివిక్రమ్ కి సూచించారట.


ఒకవేళ సినిమా ప్రాజెక్టు ఓకే అయితే వచ్చే వేసవి నుండి సినిమా షూటింగ్ స్టార్ట్ చేద్దామని కూడా క్లారిటీ ఇచ్చినట్లు ఫిలింనగర్ లో టాక్. ప్రత్యేకంగా ఈ సినిమాకి జూనియర్ ఎన్టీఆర్ అన్నయ్య కళ్యాణ్ రామ్ నిర్మాతగా కూడా వ్యవహరించాబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం త్రివిక్రమ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ అయిన వెంటనే జూనియర్ ఎన్టీఆర్ తో చేయబోయే సినిమా స్క్రిప్ట్ పై కూర్చునే ఓ కొలిక్కి తీసుకువచ్చాక పక్కా ప్లానింగ్ తో అంతా ఓకే అయ్యాక సినిమా షూటింగ్ స్టార్ట్ చేయాలనే ఆలోచనలో త్రివిక్రమ్ ఉన్నట్లు సమాచారం. మొత్తంమీద రెండో సారి వీరిద్దరి కలయికలో ఓ సినిమా రాబోతుంది అన్న వార్త ఇటీవల సోషల్ మీడియాలో రావటంతో నందమూరి అభిమానులు ఎంతగానో సంతోషిస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: