ఎట్టకేలకు పూరి టెంపర్ తరువాత ఓ భారీ కమర్షియల్ హిట్ కొట్టారు. ఆ సినిమా కంటెంట్, ఆ హిట్ ఎలా పడిందో పూరీ ఫ్యాన్స్ సంగతి ఎలా వున్నా సినిమా జనాలకు, హీరోలకు క్లియర్ గా తెలుసు. కానీ లక్కీగా పెద్ద హిట్టే పడింది. ఈ సినిమా తర్వాత స్టార్ హీరోలతో సినిమా ఉండబోతోంది అని బాగా ప్రచారమైతే జరుగుతుంది కానీ ఏ హీరో కూడా ఖాళీగాలేరు. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా వున్నారు. ఇలాంటి టైమ్ లో కూడా ఇదిగో పూరి నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే అంటూ తెగ గాసిప్స్ వదులుతున్నారు.కన్నడ హీరో నిఖిల్ గౌడ్, తర్వాత మరో కన్నడ హీరో యశ్ తో సినిమా అన్నారు. వందల కోట్ల రేంజ్ సినిమాలు చేస్తున్న యశ్ పూరితో సినిమా చేస్తాడో? చేయడో అంటూ మళ్ళీ రివర్స్ లో పంచ్ లు కూడా పడ్డాయి. ఇదిలావుంటే ఇప్పుడు లేటెస్ట్ గా వినిపిస్తున్న పేరు విజయ్ దేవరకొండ. 

డియర్ కామ్రేడ్ తో దారుణమైన డిజాస్టర్ ని చూసాడు కాబట్టి, పూరితో సినిమా చేస్తాడేమో అన్న ఆలోచనలో ఈ పుకారు పుట్టింది. కానీ నిజంగా అది పుకారేనన్న మాట మరోవైపు వినిపిస్తూనే ఉంది. ఇస్మార్ట్ శంకర్ విడుదలయ్యాక ఇప్పటి వరకు పూరి-విజయ్ ల మధ్య ఒక్క సిట్టింగ్ కూడా జరగలేదు కాబట్టి ఇందులో  వాస్తవముంది. అంతేకాదు విజయ్ చేతిలో ఇప్పటికే రెండు సినిమాలు వున్నాయి. ఇది పక్కనపెడితే మంచి స్క్రిప్ట్ లేకుండా విజయ్ ఓకె చెప్పడన్న సంగతి అందరికి తెలిసిందే. మరి పూరి కేవలం లైన్ చెప్పి ఒప్పించడం కానీ పని. ఇక పూరి జగన్నాథ్ ప్రస్తుతం ఓ హిందీ సినిమా చేసే ఆలోచనలో వున్నారని లేటెస్ట్ గా ఫిల్మ్ నగర్ లో ఒక కొత్త మాట వినిపిస్తుంది. ఇస్మార్ట్ శంకర్ కు ముందు నుంచే ఆ ప్రయత్నం చేశాడట పూరి. 

ఈయన చెప్పిన లైన్ కూడా ఓకె అయిపోయిందని న్యూస్. ఇస్మార్ట్ శంకర్ హడావుడి తగ్గాక ముంబాయి వెళ్లి ప్రాజెక్ట్ సెట్ చేసుకొని వస్తాడని తెలుస్తోంది. ఎందుకంటే తెలుగు సినిమా చేస్తే ఏడెనిమిది కోట్లు లేదా పదికోట్లు వస్తాయి. అదే బాలీవుడ్ సినిమా ప్యాకేజ్ ఓకె చేయించుకంటే ఆ లెక్కే వేరు. అందుకే పూరి హిందీ సినిమా తీసి, హిట్ కొట్టగలిగితే, అప్పుడు ఇక్కడ పెద్ద హీరోలు కూడా లైన్ లోకి వచ్చే ఛాన్స్ ఉంది. అందుకే పూరి బాలీవుడ్ లో సినిమా చేయడానికి ప్రయత్నాలు స్టార్ట్ చేస్తున్నట్లు ఫ్రెష్ అప్‌డేట్. 



మరింత సమాచారం తెలుసుకోండి: