చాలా సంవత్సరాల తర్వాత ‘ఇస్మార్ట్ శంకర్’ రూపంలో సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడు రామ్. ఎన్నో సంవత్సరాల రకరకాల స్టోరీలు చేసిన అభిమానులను తెలుగు ప్రేక్షకులను మెప్పించలేకపోయినా రామ్...కెరియర్ లో మొట్ట మొదటి సారి ఓరా మాస్ క్యారెక్టర్ లో నటించి అదిరిపోయే సూపర్ డూపర్ బంపర్ హిట్ అందుకున్నాడు. అయితే తాజాగా రామ్ ఓ తమిళ రీమేక్ సినిమా చేస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. అంతేకాకుండా సొంత బ్యానర్ నిర్మాత మరియు పెదనాన్న స్రవంతి రవి కిషోర్ ఇప్పటికే ఆ సినిమా ని హీరో రామ్ కోసం కొనుగోలు చేయడం జరిగింది. ఈ సినిమాని ‘నేను శైలజ’, ‘ఉన్నది ఒకటే జిందగీ’ వంటి సినిమాలను డైరెక్ట్ చేసిన  కిషోర్ తిరుమల డైరెక్ట్ చేస్తారని కూడా వార్తలు ఇటీవల వచ్చాయి.


అయితే తనని ఎన్నడూ లేనివిధంగా ప్రేక్షకులు అభిమానులు పూర్తిగా తన లో మాస్ హీరో ని చూడటంతో రాబోయే రోజుల్లో అదే తరహాలో సినిమాలు చేయాలని రామ్ డిసైడ్ అయ్యాడట. దీంతో తమిళ్ రీమేక్ సినిమా కథ, కథనాలు బాగానే ఉన్నప్పటికీ వద్దని మొహం మీద డైరెక్టర్ కి పెదనాన్న అయిన నిర్మాత స్రవంతి రవి కిషోర్ కి చెప్పేశాడట. కెరీర్ మంచి టైమింగ్ లో ఉన్న సమయంలో ఎక్స్పరిమెంట్లు చేయడం నా వల్ల కాదని రామ్ తేల్చి చెప్పినట్లు టాక్.


దీంతో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ హోల్డ్ లో పడింది. రామ్ కి బదులు వేరే హీరోని తీసుకోవాలా..? లేక కొన్నాళ్లు ఈ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టాలా..? అనే డైలమాలో నిర్మాత స్రవంతి రవికిషోర్ పడినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం రామ్ చాలా కథలు వింటున్నాడట. మొత్తం మీద చాలా సంవత్సరాల తర్వాత ఎన్నో ఫ్లాపులు చూసిన ఎనర్జిటిక్ హీరో రామ్ కి అదిరిపోయే సూపర్ డూపర్ హిట్ పడటంతో సినిమాలు ఎంచుకునే విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: