టాలీవుడ్ లో దేవదాసు సినిమాతో హీరోగా పరిచయం అయిన రామ్ పోతినేన ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించారు. కెరీర్ బిగినింగ్ లో వదాస్ కి వచ్చిన హిట్ తర్వాత సినిమాలకు అందుకోలేక పోయాడు. కాకపోతే టాలీవుడ్ లో మాత్రం మంచి ఎనర్జిటిక్ హీరోగా రామ్ మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇదే సమయంలో శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ‘రెడీ’ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది.  ఈ మూవీలో రామ్, బ్రహ్మానందం మద్య వచ్చే కామెడీ థియేటర్లో ఆడియన్స్ పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుంటారు. 

రెడీ మూవీలో రామ్ సరసన బాలీవుడ్ బ్యూటీ  జెనీలియా నటించింది.  వీరి కెమిస్ట్రీ చాలా బాగా వర్క్ ఔట్ అయ్యింది. సినీనటి జెనీలియా సోమవారం తన 32వ పుట్టిన రోజు జరుపుకొన్నారు. ఈ సందర్భంగా బాలీవుడ్‌, టాలీవుడ్‌ నటులు ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీ సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని మంచి కలెక్షన్లు సాధిస్తుంది.  ఈ సినిమా సక్సెస్ ని చిత్ర యూనిట్ తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తూ సంబంరాలు చేసుకుంటున్నారు. 

మొన్నటి వరకు విదేశాల టూర్ కి వెళ్లివచ్చిన రామ్ ‘ఇస్మార్ట్ శంకర్’ హ్యాపీనీ తన ప్రాణ స్నేహితులతో పంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ‘ఇస్మార్ట్‌శంకర్‌’తో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకున్న రామ్‌ పోతినేని జెనీలియాను స్వయంగా కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జెనీలియా, రితేష్‌ దేశ్‌ముఖ్‌తో కలిసి దిగిన ఫొటోను సోషల్‌మీడియాలో పోస్టు చేస్తూ ‘స్వీటెస్ట్‌, క్యూటెస్ట్‌, బెస్టెస్ట్‌ జెనీలియాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు.

ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నా’ అంటూ పోస్టు చేశాడు.  సత్యం సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన జెనీలియా బొమ్మరిల్లు సినిమాతో హాసిని గా అందరికి అలా గుర్తుండి పోయింది. రానాతో నా ఇష్టం సినిమా తరువాత మళ్ళీ కనిపించలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: