అన్న నందమూరి తారకరామారావు వారసుడు బాలయ్య. ఆయన తరువాత సినిమా రంగంలో బాలయ్య నిలిచి తన సత్తాను చాటుకున్నారు. తండ్రి మాదిరిగానే సాంఘిక, జానపద, చారిత్రాత్మక, పౌరాణిక మూవీస్ చేస్తూ తగినవాడు అనిపించుకున్నారు. బాలయ్య ఇప్పటి తరం హీరొల్లో  వంద మూవీస్ చేసిన మొనగాడుగా రికార్డ్ స్రుష్టించారు. బాలయ్య టాప్ ఫోర్  లో ఒకరుగా ప్లేస్ సంపాదించడమే కాదు నాలుగున్నర దశాబ్దాలుగా తన హవా కొనసాగిస్తున్నారు. బాలయ్య అంటే పడి చచ్చే ఫ్యాన్స్ ఆయన సొంతం. ఆయన కెరీర్ల ఎన్నో రికార్డ్ చిత్రాలు ఉన్నాయి.


ఇక బాలయ్యకు సంబంధించి ఒక విషయం వైరల్ అవుతోంది. ఆయనకు సినిమాలు తగ్గించడం పట్ల కూడా రకరకాలుగా ప్రచారం సాగుతోంది. బాలయ్య యంగ్ హీరోలతో పాటే దూసుకుపోతూ ఏడాదికి కనీసం రెండు సినిమాలు జనం ముందుకు తెచ్చేవారు. ఆయన స్పీడూ జోరూ అలా ఉండేవి. ఇక తప్పకుండా సంక్రాంతికి ఒక సినిమా తీసుకురావడం కూడా బాలయ్య క్రెడిట్లో మరోటిగా వుంది. అటువంటి బాలయ్య ఇపుడు బాగా నెమ్మదించేశాడని అంటున్నారు. 


ఈ ఏడాది మొదట్లో ఆయన ఎంతో ఇష్టపడి తన తండ్రి ఎన్టీయార్ మీద తీసిన రెండు సినిమాలు డిజాస్టర్స్ అయ్యాయి. దాంతో బాలయ్య బాగా అప్ సెట్ అయ్యారు. దానికి తోడు అన్నట్లుగా ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓటమి పాలు అయింది. ఈ రెండు పరిణామాలకు తోడు ఆయన కుమారుడు మోక్షజ్గ్ణ   కూడా సినీ  వారసుడుగా రాకపోవడం కూడా బాలయ్యని కలతను గురి చేసిందని అంటున్నారు.


మూడు నెలల క్రితం బాలయ్య, కేఎస్ రవికుమార్ కాంబోలో సినిమా అని ప్రచారం అయితే జరిగింది. ఇప్పటికి అది పట్టాలు ఎక్కలేదు. దీంతో సంక్రాంతి పోటీ నుంచి బాలయ్య తప్పుకోవాల్సివచ్చింది. మరి ఈ సినిమా ఎపుడు స్టార్ట్ అవుతుంది. అసలు చేస్తారా లేదా అన్న డౌట్లు కూడా వస్తున్నాయి. బాలయ్య సరేనంటే సినిమాలు తీసేందుకు ఓ వైపు దిల్ రాజు ఉన్నారు. మరో వైపు డైరెక్టర్ పూరీ జగన్నాధ్ ఎదురుచూస్తున్నారు.


ఇంకా మరికొంతమంది నిర్మాతలు కూడా ఉన్నారు. అయినా సరే బాలయ్య ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారన్నదే అర్ధం కావడం లేదు. మిగిలిన సీనియర్ హీరోలు వెంకీ, నాగ్ చిరు మళ్ళీ రేసులోకి వచ్చి సత్తా చూపిస్తున్న వేళ ఎపుడూ జోరుమీద ఉండే బాలయ్య సినిమా  బండి ఆగిపోవడం పట్ల ఫ్యాన్స్ తెగ ఫీల్ అవుతున్నారు. మరి బాలయ్య మూవీస్ లో కొనసాగుతారా, లేక  మరేదైనా  అన్న డౌట్లు వస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: