నాచురల్ స్టార్ నాని హీరోగా, వెరైటీ చిత్రాల దర్శకుడు విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న లేటెస్ట్ మూవీ గ్యాంగ్ లీడర్. టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థల్లో ఒకటైన మైత్రి మూవీ మేకర్స్ వారు  అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ మరియు ఒక సాంగ్ ఇప్పటికే యూట్యూబ్ లో విడుదలై, వీక్షకుల నుండి మంచి స్పందనను రాబట్టిన విషయం తెలిసిందే. ఇక ఈ నెల 30వ తేదీన రిలీజ్ కానున్న ఈ సినిమాకు సంబంధించి గత కొద్దిరోజులుగా రిలీజ్ వాయిదా పడిందంటూ కొన్ని మీడియా మాధ్యమాల్లో షికారు చేస్తున్నాయి. అయితే ఆ వార్తకు మరింత బలం చేకూరుస్తూ నిజంగానే సినిమా రిలీజ్ వాయిదా పడినట్లు నేడు మరింతగా వార్తలు వస్తున్నాయి.  

అవును, నిజంగానే గ్యాంగ్ లీడర్ వాయిదా పడింది అనేది ఆ వార్త తాలూకు సారాంశం. నిజానికి కొన్ని నెలల క్రితమే తమ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినప్పటికీ, అనూహ్యంగా ఇటీవల సాహో సినిమాను కూడా తమ సినిమా రిలీజ్ రోజునే విడుదల తేదీ ఫిక్స్ చేయడంతో గ్యాంగ్ లీడర్ యూనిట్ కొంత సందిగ్ధంలో పడింది. ఇక కొద్దిరోజుల క్రితం ఈ రెండు సినిమాల నిర్మాతల మధ్య రాజీ జరిగిందని వార్తలు వచ్చినప్పటికీ, దానిపై ఇప్పటివరకు క్లారిటీ లేదు. ఇకపోతే నిన్న సాహో సినిమా యూనిట్ వారు, తమ సినిమా కోసం పలువురు నిర్మాతలు వారి సినిమాల విడుదల తేదీలు వాయిదా వేసుకున్నందుకు ధన్యవాదాలు తెల్పుతూ హీరో ప్రభాస్ సహా ఒక ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. అయితే దానిని బట్టి నాని గ్యాంగ్ లీడర్ కూడా వాయిదా పడిందని, అందుకే గత కొద్దిరోజలుగా మైత్రి మూవీస్ యూనిట్, తమ సినిమా అప్ డేట్స్ విషయమై సైలెంట్ గా ఉందని, 

ఇక రేపో, మాపో తమ సినిమా కొత్త రిలీజ్ డేట్ తో మళ్ళి ప్రమోషన్ మొదలెడతారని అంటున్నారు. అయితే ప్రస్తుతం విపరీతంగా ప్రచారం అవుతున్న ఈ వార్తపై ఇప్పటివరకు గ్యాంగ్ లీడర్ మూవీ యూనిట్ నుండి ఎటువంటి అధికారిక ప్రకటన లేనప్పటికీ, సాహో తో పోటీ కంటే సినిమాను వాయిదా వేయడమే బెటర్ అని అంటున్న పలువురి అభిప్రాయాన్ని నిర్మాతలు పరిగణలోకి తీసుకున్నట్లు సమాచారం. మరి గ్యాంగ్ లీడర్ విషయమై ఏమి జరుగనుందో తెలియాలంటే మరికొద్దిరోజలు ఆగాల్సిందే......!!


మరింత సమాచారం తెలుసుకోండి: