హాలీవుడ్ లో చీకటి కోణాన్ని వెలికి తీసిన ఉద్యమం "మీ టూ". హాలీవుడ్ తర్వాత ఇది బాలీవుడ్ కి కూడా చేరి చాలా మందిని ఇరకాటన పెట్టింది. చాలా మంది హీరోయిన్లు తాము కూడా ఒకానొక టైంలో లైంగికంగా వేధింపులకి గురయ్యామని తెలిపారు. అప్పటి నుండి ఈ లైంగిక వేధింపులని ఫిల్మ్ ఇండస్ట్రీ సీరియస్ గా తీసుకుంది. ఎవరైతే ఇలా వేధింపులకి గురి చేస్తున్నారో వారిని ఇండస్ట్రీ నుండి దూరం పెట్టాలనే భావిస్తున్నారు.


అయితే ఈ క్రమంలో బాలీవుడ్ అగ్రనటి దీపికా పదుకునే సంచలన నిర్ణయం తీసుకున్నది.లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న సినీ ప్రముఖులతో పనిచేసేది లేదని స్పష్టం చేసింది. ఇటీవల దీపిక పదుకోన్, రణ్‌బీర్ కపూర్  దర్శకుడు లవ్ రంజన్ ఇంటిలో కనిపించడంతో అనేక కథనాలు మీడియాలో కనిపించాయి.అజయ్ దేవగణ్, రణ్‌బీర్ కపూర్‌తో లవ్ రంజన్ రూపొందించే చిత్రంలో దీపిక నటిస్తున్నట్టు వార్తలు వచ్చాయి.


ఇద్దరు అగ్ర హీరోలతో నిర్మించే చిత్రంలో హీరోయిన్‌కు కూడా బలమైన పాత్ర ఉందని, ఆ పాత్రకి దీపికని హీరోయిన్ గా సెలెక్ట్ చేసారని , దీపిక కూడా ఆ పాత్ర చేయడానికి సిద్ధమయ్యారనే వార్త ఊపందుకుంది. అయితే, లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న లవ్ రంజన్ చిత్రంలో దీపిక నటించవద్దని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. దీనిలో భాగంగా దీపిక అభిమానులు #NotMyDeepika అనే ట్యాగ్ తో వాళ్ళ నిరసనని తెలియజేసారు.


ఈ నేపథ్యంలో మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ లైంగిక ఆరోపణలు ఎదుర్కొనే ఏ సినీ ప్రముఖుడితో నటించేది లేదని స్పష్టం చేసింది. దీంతో ఆమె లవ్ రంజన్ చిత్రంలో నటించబోవటం లేదని అర్థం అవుతుంది. అయితే లవ్ రంజన్ చెప్పిన కథ ఆమెకు బాగా నచ్చిందని, కానీ ఆ పాత్ర చేయలా వద్దా అనేది ఇంకా డిసైడ్ అవలేదని తెలిపింది.



మరింత సమాచారం తెలుసుకోండి: