బాలక్రిష్ణ గత ఎనిమిది నెలలుగా ఖాళీగానే ఉన్నారు. ఆయన ఎన్నికల్లో గెలిచినా ఆయన గారి తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. దాంతో రాజకీయంగా కూడా పెద్దగా పనిలేదు. ఇక బాలయ్య సినిమాలు వరసపెట్టి చేస్తారని పేరుంది. కానీ ఇపుడు అది కూడా తగ్గించేశారు. గత నాలుగు నెలలుగా ఆయన ఓ సినిమా పట్టాలెక్కించలాని చూస్తున్నారు. ఆ ముహూర్త బలం ఏంటో కానీ ఇప్పటికీ అది కుదరడంలేదు. ఇంతలో...


బాలయ్య ఇపుడు అర్జంట్ గా బ్యాంకాక్ టూర్ పెట్టుకున్నారు. మళ్ళీ ముఖానికి రంగు పూసుకుని అందమైన అమ్మాయిలతో డ్యూయెట్లు పాడేందుకు బాలయ్య బాబు రెడీ అయిపోతున్నారు. ఈ నెల 9 నుంచి బాలయ్య  కొత్త మూవీ బ్యాంకాక్ తో షూటింగ్ కి రెడీ అవుతోంది. రూలర్ అని వర్కింగ్ టైటిల్ తో తయారవుతున్న ఈ మూవీలో ఇద్దరు కత్తుల్లాంటి హీరోయిన్లు ఉన్నారు.


అందులో ఓ భామా సోనాలి చౌహాన్, బాలయ్యతో ఆమె లెజెండ్, డిక్టేటర్ మూవీలు చేసింది, ముచ్చటగా మూడవసారి రూలర్ మూవీలో జంట కడుతోంది. మరో హీరోయిన్ వేదిక, ఈ అమ్మాయితో బాలయ్య కాంబో ఇదే ఫస్ట్ టైం. బాలయ్య ఈ ఇద్దరు ముద్దు గుమ్మలతో బ్యాంకాక్ లో  సాంగులేసుకుంటాడుట. ముందు సాంగ్స్ తో రూలర్ షూటింగ్ బిగిన్ చేయడం విశేషం.


బాలయ్యతో జై సింహా  మూవీని డైరెక్ట్ చేసిన సీనియర్ డైరెక్టర్ కే ఎస్ రవికుమార్ ఈ మూవీకి డైరెక్టర్.  నిర్మాత సి కళ్యాణ్ రూలర్ నిర్మిస్తున్నారు. ఇందులో బాలయ్య డ్యూయల్ రోల్ ప్లే చేస్తారట. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో వచ్చే ఈ మూవీలో బాలయ్య పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తారట. ముందు సాంగ్స్ కంప్లీట్ చేసుకుని మిగిలిన సినిమాను తరువాత తీస్తారట. మొత్తానికి బాలయ్య చాలా నెలల తరువాత 105 వ మూవీతో మళ్ళీ బిజీ అవుతున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: