సినిమాలు హిట్ అయిన సందర్భాలలో సక్సెస్ సంబరాలలో పాల్గొనే సూపర్ స్టార్ మహేష్ బాబు కి తాజాగా ఇటీవల ఒక వింత అనుభవం ఎదురయింది. రేపు మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఒకపక్క సూపర్ స్టార్ మహేష్ అభిమానులు సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేయడానికి రికార్డులు సృష్టించడానికి ఎవరి పనిలో వారు ఉండగా మరోపక్క మహేష్ బాబు తాను ప్రస్తుతం నటిస్తున్న 'సరిలేరు నీకెవ్వరు' సినిమా కి సంబంధించిన పోస్టర్ గానీ టీజర్ గానీ విడుదల చేయడం గ్యారెంటీ అనే టాక్ ఫిలింనగర్ లో వార్తలు వినబడుతున్నాయి.


అంతేకాకుండా వరుసగా రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ రావడంతో మహేష్ కూడా ఈ సినిమాతో ఎలాగైనా హ్యాట్రిక్ కొట్టే ఆలోచనలో మంచి కసి మీద ఉన్నాడు. కమర్షియల్ రూపంలో కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ విజయశాంతి రీ ఎంట్రీ ఇస్తుండగా మరోపక్క కమెడియన్ బండ్ల గణేష్ కూడా సినిమాలో నటిస్తుండటం విశేషం. ఇటువంటి నేపథ్యంలో ఇటీవల తాజాగా హైదరాబాదులో హంబుల్ బ్రాండ్ కి సంబంధించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న మహేష్ బాబు అభిమానులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా పలు ప్రశ్నలు అడిగిన అభిమానులకి కెరీర్ లో మొట్ట మొదటి సారి డిఫరెంట్ అనుభవం ఎదుర్కొన్నాడు. విషయంలోకి వెళితే మహేష్ బాబును ఒక ఫిమేల్ అభిమాని క్వశ్చన్ చేసింది.


ఆమె మహేష్ బాబు ను అడిగింది ఏమిటి అంటే. తన భర్త మీకు పెద్ద ఫ్యాన్ అని నన్ను నమ్రత అని పిలుస్తారని నేను నా భర్తని మహేష్ బాబు అని పిలుస్తాను అని చెప్పటంతో మహేష్ బాబు పడి పడి నవ్విన పొట్టచెక్కలయ్యేలా నవ్వడం జరిగింది. అంతేకాకుండా మహేష్ బాబు మహారాష్ట్రకు చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడంతో..తాను కూడా నేను మహారాష్ట్రకు చెందిన అమ్మాయిని కాబట్టి నన్ను పెళ్లి చేసుకున్నారని తెలిపింది. ఈ క్రమంలో కెరియర్ లో మొట్ట మొదటి సారి డిఫరెంట్ ప్రశ్న ఎదుర్కొన్నాడు మహేష్ బాబు. ఇంతకీ ఆవిడ అడిగిన ప్రశ్న ఏమంటే.. నమ్రత మీకు ఎలాంటి షర్ట్స్ తరచూ ఇస్తుంటారని అడగ్గా.. బ్లూ చెక్స్ షర్ట్స్ ఇస్తారని చెప్పారు. ఇక నుంచి తన భర్తకు కూడా తాను బ్లూ కలర్ చెక్స్ ఉన్న షర్ట్ ఇవ్వనున్నట్లుగా చెప్పుకొచ్చారు. మొత్తం మీద మహేష్ బాబు తన కెరీర్ లో ఈ స్థాయిలో కూడా తనకు వీరాభిమానులు ఉంటారని ఎవరు ఊహించి ఉండరు. 



మరింత సమాచారం తెలుసుకోండి: