టాలీవుడ్ కింగ్ నాగార్జున హీరోగా ప్రస్తుతం రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన మన్మధుడు2 సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. కొన్నేళ్ల క్రితం నాగార్జున, సోనాలి బింద్రే, అన్షు ల కాంబినేషన్లో విజయ భాస్కర్ తెరకెక్కించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ మన్మధుడు సినిమాకు సీక్వెల్ గా రాబోతున్న ఈ సినిమాపై టాలీవుడ్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. 

ఇప్పటికే రిలీజయిన ఈ సినిమాలోని సాంగ్స్ మరియు ట్రైలర్, సినిమాపై అంచనాలు విపరీతంగా పెంచేశాయనే చెప్పాలి. ఇక ట్రైలర్ మరియు సాంగ్స్ లో నాగార్జున ఎంతో యంగ్ గా కనపడుతూ మరొక్కసారి తన ఫ్యాన్స్ ను ఖుషి చేయనున్నారని అర్ధం అవుతోంది. అలానే నాగ్ మరోయు రకుల్ ల జోడి కూడా ఎంతో బాగుందని ఫ్యాన్స్ నుండి మంచి స్పందన లభిస్తోంది. అయితే ఇటీవల తెలుగులో కూడా రకుల్ కు పెద్దగా సక్సెస్ లు లేకపోవడంతో ఆమె కూడా ఈ సినిమాపైనే ఎక్కువగా ఆశలు పెట్టుకున్నట్లు సమాచారం. వాస్తవానికి 2017లో ఆమె హీరోయిన్ గా నటించిన ధ్రువ, రారండోయి వేడుక చూద్దాం తరువాత ఆమె ఇప్పటివరకు తెలుగులో పెద్దగా సినిమాలు చేయనప్పటికీ, రిలీజయిన రెండు, మూడు సినిమాలు కూడా సక్సెస్ సాధించలేదు. 

ఆ తరువాత ఆమె తమిళ మరియు పలు హిందీ సినిమాల్లో నటిస్తూ వస్తున్నారు. ఇక కొంత గ్యాప్ తరువాత నాగ్ వంటి స్టార్ హీరోతో తాను జతకడుతున్న ఈ సినిమా కనుక హిట్ అయితే, తప్పకుండా టాలీవుడ్ లో మరిన్ని అవకాశాలు వస్తాయని రకుల్ ఆశిస్తోందట. అయితే ఈ సినిమాపైన అలానే హీరో నాగార్జున గారిపైన తనకు ఎంతో నమ్మకం ఉందని, తప్పకుండా సినిమా మంచి సక్సెస్ సాధించితీరుతుందని ఆమె తన సన్నిహితులతో చెప్పినట్లు సమాచారం. మరి రేపు రిలీజ్ కాబోయే ఈ సినిమాతో నాగ్ ఎంతటి విజయాన్ని అందుకుంటారో చూడాలి...!! 


మరింత సమాచారం తెలుసుకోండి: