Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Sep 16, 2019 | Last Updated 1:36 am IST

Menu &Sections

Search

టాలీవుడ్ తొలితరం సూపర్ స్టార్ 'చిత్తూరు నాగయ్య' గారి గురించిన ఆసక్తికర విషయాలు....!!

టాలీవుడ్ తొలితరం సూపర్ స్టార్ 'చిత్తూరు నాగయ్య' గారి గురించిన ఆసక్తికర విషయాలు....!!
టాలీవుడ్ తొలితరం సూపర్ స్టార్ 'చిత్తూరు నాగయ్య' గారి గురించిన ఆసక్తికర విషయాలు....!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు సినిమా గమనం ప్రారంభమైన తొలినాళ్లలో ఎందరో నటీనటులు చిత్ర సీమకు రావడం, ఆపై నటులుగా మంచి పేరు సంపాదించడం జరిగింది. అయితే ఆ విధంగా అప్పట్లో నటుడిగా పరిచయమైన పద్మశ్రీ చిత్తూరు నాగయ్య గారు నటుడిగా ఒక్కోమెట్టు ఎక్కుతూ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నటుడిగా సుస్థిర స్థానాన్ని సంపాదించారు. 1904, మార్చి 28న చిత్తూరు జిల్లాలో బ్రాహ్మణ కుటుంబాబికి చెందిన రామలింగ శర్మ, వెంకట లక్ష్మాంబ దంపతులకు నాగయ్య జన్మించారు. ఆయన అసలు పేరు 'ఉప్పలదడియం నాగయ్య శర్మ'. ఆయన బాల్యం అంతా చిత్తూరు జిల్లాలోనే సాగింది, అప్పట్లో నాగయ్య గారు తిరుమల తిరుపతి దేవస్థానం వారి స్కాలర్షిప్ తో చదువుకోవడం, ఆపై తన డిగ్రీ చదువును కూడా అదే జిల్లాలో పూర్తి చేయడం జరిగింది. చదువుల అనంతరం ఒక గవర్నమెంట్ ఆఫీసులో కొన్నాళ్లపాటు క్లర్క్ గా పనిచేసిన నాగయ్య గారు, ఆపై కొన్నాళ్ళు ఆంధ్ర పత్రిక తరపున జర్నలిస్ట్ గా కూడా పనిచేయడం జరిగింది. ఇక అప్పట్లో మహాత్మా గాంధీ, మరియు జవహర్ లాల్ నెహ్రు గారి భావాలను ఎంతో ఇష్టపడే నాగయ్య గారు, వారి అడుగుజాడల్లో నడిచి 1930 నాటి దిండి ఉద్యమంలో కూడా పాల్గొనడం జరిగింది. 

అనంతరం సినిమాల మీద ఆసక్తితో తొలుత 1938లో గృహలక్ష్మి అనే సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన నాగయ్య గారు, నటుడిగా మొదటి సినిమాతోనే మంచి పేరు సంపాదించడంతో, అక్కడినుండి ఆయనకు అవకాశాలు మొదలయ్యాయి. ఆపై వందేమాతరం, సుమంగళి, విశ్వమోహిని, దేవత, భక్తపోతన తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు నాగయ్య గారు. అంతేకాక అప్పట్లో ఆయన అశోక్ కుమార్, మీరా, చక్రధారి వంటి తమిళ సినిమాల్లో కూడా నటించి తమిళ ప్రేక్షకుల మెప్పు కూడా పొందడం జరిగింది. ఇక అక్కడినుండి కెరీర్ పరంగా ఎన్నో సినిమాల్లో నటించిన నాగయ్య గారు కేవలం నటుడిగానే కాక సంగీత దర్శకుడిగా, సింగర్ గా, నిర్మాతగా, రచయితగా పలు చిత్రాలకు పనిచేసారు. ఇక ఆయన 1964లో నటించిన రామదాసు చిత్రం, ఉత్తమ తెలుగుచిత్రంగా అప్పట్లో జాతీయ అవార్డు గెలుచుకుంది. ఆ తరువాత 1965లో నాగయ్య గారిని ఆంధ్ర ప్రభుత్వం పద్మశ్రీ బిరుదుతో సత్కరించడం జరిగింది. తెలుగు సినిమా అగ్రనటులు ఎన్టీఆర్, ఎఎన్నార్ వంటి వారు పూర్తిగా నటనలో ప్రవేశించక మునుపే, నాగయ్య గారు తెలుగు చిత్ర సీమలో మంచి గుర్తింపు పొందిన నటుడిగా కొనసాగారు. ఇక అప్పట్లో లక్ష రూపాయల పారితోషికం అందుకున్న ఏకైక నటుడైన నాగయ్య గారిని, ఆ తరువాత పలు సందర్భాల్లో ఎందరో నటీనటులు తొలితరం సూపర్ స్టార్ అని ఆయనను కీర్తించేవారు. ఇక నాగయ్య గారి కుటుంబ జీవితం గురించి  చెప్పాలంటే, మొదట యుక్త వయస్సులో జయలక్ష్మి అనే ఆమెను వివాహమాడిన నాగయ్య గారు, 

ఆమె ఒక బిడ్డకు జన్మనిచ్చి మరణించిన తరువాత, గిరిజ అనే ఆవిడను రెండవ వివాహం చేసుకోవడం, ఆపై కొన్నాళ్ళకు గిరిజ గారు కూడా ఒక బిడ్డకు జన్మనిచ్చి అనారోగ్యకారణాలతో మరణించడం జరిగింది. ఆ తరువాత కొద్దిరోజులకు ఆయన మొదటి భార్య బిడ్డ కూడా మరణించడంతో నాగయ్య గారు కొంత మానసికంగా కృంగిపోవడం జరిగింది. ఇక మెల్లగా తనకు వయసు మీద పడడం, అలానే సినిమా అవకాశాలు కూడా తగ్గడంతో అప్పట్లో నాగయ్య గారు కొన్నాళ్ళు రమణ మహర్షి గారి ఆశ్రమంలో కొన్నాళ్ళు బస చేసారు. తనకు సంపద ఉన్నంతకాలం చేతికి ఎముక లేకుండా ఎందరికో దానధర్మాలు చేసిన నాగయ్య గారు, జీవితం చరమాంకంలో మాత్రం, డబ్బు లేక దీనమైన స్థితిలో 1973, డిసెంబర్ 30న మరణించడం జరిగింది. ప్రస్తుతం ఆయన కుటుంబసభ్యులు తిరుపతిలోనే నివసిస్తున్నట్లు సమాచారం. నాగయ్య గారు భౌతికంగా మన మధ్యన లేకున్నా, వారి సినిమాల్లోని పాత్రలు మాత్రం, మనతో ఎప్పుడూ వారిని మన ప్రక్కనే ఉన్నట్లు గుర్తు చేస్తూ ఉంటాయి......!!


chittoor-nagaiah
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బాబోయ్, 'సైరా' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అంత ఖర్చా.....??
'సైరా' కు సూపర్ హిట్ సర్టిఫికెట్ ఇచ్చారుగా......!!
బాలయ్య - బోయపాటి సినిమా అఫీషియల్ అనౌన్స్మెంట్.....!!
అదరగొట్టిన 'రాజు గారి గది' 3 ట్రైలర్......!!
'సాహో' పై శ్రద్ధ కపూర్ సంచలన కామెంట్స్......!!
త్వరలో హీరోగా రాబోతున్న దిల్ రాజు ఫ్యామిలీ వారసుడు....!!
'సైరా' లో మెయిన్ హైలైట్స్ ఏవంటే.....??
అందుకే 'నాని' అందరికంటే అంత ప్రత్యేకం......!!
నాని 'గ్యాంగ్ లీడర్' పై సుకుమార్ కామెంట్స్....!!
'నాపేరు సూర్య' దర్శకుడు ఎక్కడంటే....??
టాలీవుడ్ లో మరొక స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ పట్టేసిన కియారా అద్వానీ....??
ఎల్లలు దాటిపోయిన అడివి శేష్ 'ఎవరు' మూవీ క్రేజ్...వీడియో వైరల్......!!
బ్రేకింగ్ : 'ఫ్లిప్ కార్ట్ - అమెజాన్' బిగ్ బిలియన్, గ్రేట్ ఇండియన్ సేల్స్ కు కేంద్రం బ్రేక్.....??
ఆ వ్యాధితో ఆరేళ్ళ నుండి బాధపడుతున్నా : 'సాహో' హీరోయిన్ శ్రద్ధ కపూర్......!!
ఇన్స్టాగ్రామ్ లో సమంత షాకింగ్ పోస్ట్ ..... సోషల్ మీడియాలో వైరల్....!!
బాబోయ్, సుధీర్ బాబు ఎంత పని చేసాడు.....!!
మొత్తానికి అఖిల్ కి హీరోయిన్ దొరికింది....!!
షాకింగ్ : 'సైరా' లో పవర్ స్టార్ స్పెషల్ రోల్.....??
మొత్తానికి వారి నెత్తిన పాలు పోసిన నాని.....!!
అదే 'ఆర్ఆర్ఆర్' కు పెద్ద దెబ్బేయనుందా....??
అందుకే సూర్య అంటే మనోళ్ళకి అంత అభిమానం......!!
లేటెస్ట్ అప్డేట్ : 'కెజిఎఫ్' డైరెక్టర్ నెక్స్ట్ ఆ హీరోకే ఫిక్స్ అట
రెబల్ స్టార్ కు భారీ షాకిచ్చిన నాచురల్ స్టార్.....!!
‘మెగా’ టైటిల్ కు ఎట్టకేలకు న్యాయం చేసిన నాన్ మెగా హీరో ?
కధే హీరో - హీరోయన్నయతే : గ్యాంగ్ లీడర్
షాకింగ్ వీడియో : మహేష్ బాబు ఆ వ్యాధి బారిన పడ్డారట....!!
బిగ్ షాక్ : 'సైరా' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఆయన రావడం లేదు.....!!
ఆ ట్వీట్ తో చిక్కుల్లో పడ్డ అనసూయ.....వెంటనే క్షమాపణలు....!!
ప్రీమియర్ షో టాక్ : షాకిచ్చిన 'నాని' గ్యాంగ్ లీడర్....!!
పూజ గోల్డెన్ లెగ్ ఆ హీరోకి సక్సెస్ ని ఇస్తుందా......??
అయ్యో పాపం రకుల్....!!
'సరిలేరు నీకెవ్వరు' ఎలా ఉండబోతోందో చెప్పిన నిర్మాత అనిల్ సుంకర....!!
బ్రేకింగ్ : 'సైరా' ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ మరియు వెన్యూ ఫిక్స్.....!!
విజయశాంతి తో కలిసి నటించడంపై మహేష్ కామెంట్స్.....సోషల్ మీడియాలో వైరల్....!!
మరొక మూడు రోజుల్లో 'సైరా' నుండి సర్ప్రైజ్.....??
ఖైరతాబాద్ గణనాధుని నిమజ్జనం కోసం అత్యాధునిక టెక్నలాజీ వాహనాలు....!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.