ఈమధ్య స్టార్ సినిమాల ఈవెంట్స్ లో తరచు చూస్తున్న ఓ సంఘటన ఏంటంటే హీరో గారి కాళ్ల మీద అభిమానులు పడిపొవడమే.. విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వైజాగ్ లో నిర్వహించారు. ఆ టైంలో వేదిక మీదకు వచ్చి విజయ్ ను కింద పడేసినంత పని చేశాడు ఓ అభిమాని. విజయ్ బాడీ గార్డ్స్ అతన్ని పట్టుకోగా పర్లేదు అతన్ని వదలేయమని చెప్పాడు.    


దాని తర్వాత కాకినాడలో శర్వానంద్ రణరంగం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా ఈ సీన్ రిపీట్ అయ్యింది. శర్వానంద్ కాళ్ల మీద పడ్డాడు ఓ అభిమాని. అయితే దానికి శర్వా కూడా సీరియస్ అయ్యి.. మా కాళ్ల మీద కాదు మీ తల్లిదండ్రుల కాళ్ల మీద పడండి అంటూ క్లాస్ పీకాడు. ఇదిలాఉంటే సంపూర్ణేష్ బాబు కొబ్బరిమట్ట ఈవెంట్ లో కాళ్ల మొక్కుడు ప్రొగ్రాం జరిగింది.   


సంపూ మాట్లాడుతుండగా ఒక వ్యక్తి వచ్చి కాళ్ల మీద పడ్డాడు. అయితే అతన్ని లేపి ఎందుకు కాళ్ల మీద పడ్డావంటే ప్రొడ్యూసర్ చెప్పారని సమాధానం ఇచ్చాడు. అయినా కూడా సంపూ అతనితో సెల్ఫీ తీయించుకుని పంపించేశాడు. సంపూర్ణేష్ దీనితో ఏం చెప్పదలచుకున్నాడో ఏమో కాని అభిమానులు కాళ్ల మీద పడటాన్ని కూడా కామెడీ చేశాడని కొందరు అనుకుంటున్నారు.    


నిజమే హీరోలను అభిమానిస్తే సినిమా ఫస్ట్ రోజు చూడాలి.. బాగా నచ్చితే మరోసారి చూడాలి. అభిమానం ఇంకా ఉంటే సినిమా రిలీజ్ టైంలో ఫ్లెక్స్ లు కట్టాలి.. బర్త్ డేలకు మంచి పనులు చేయాలి అంతేకాని కాళ్ల మీద పడి మొక్కాల్సిన అవసరం ఏం లేదన్నది సంపూర్ణేష్ చెప్పాలనుకున్నాడు. అయితే ఈ విషయాన్ని పాజిటివ్ గా తీసుకుంటే బెటరే కాని నెగటివ్ గా వెళ్తే మాత్రం సంపూ పని అయిపోయినట్టే.   



మరింత సమాచారం తెలుసుకోండి: