సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త సినిమా సరిలేరు నీకెవ్వరు. మహేష్ బాబు ఇందులో అజయ్ కృష్ణ అనే మిలటరీ మేజర్ పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. పక్కా ఎంటర్టైన్మెంట్ తో మంచి కమర్షియల్ జానర్ లో, అన్నివర్గాల ప్రేక్షకులను అలరించేలా అనిల్ రావిపూడి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. మహేష్ సరసన రష్మిక మందన్న జోడి కడుతున్న ఈ సినిమాను జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లపై మహేష్, అనిల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. 

రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాకు గతంలో సూపర్ స్టార్ తో వన్ నేనొక్కడినే, బ్రహ్మోత్సవం సినిమాలకు పనిచేసిన సూపర్బ్ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు మరొక్కసారి ఈ సినిమాకు సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. ఇకపోతే నేడు సూపెర్ స్టార్ మహేష్ బాబు 44వ జన్మదినాన్ని పురస్కరించుకుని సినిమా యూనిట్ ఫస్ట్ లుక్ టీజర్ ని ఇంట్రో పేరుతో యూట్యూబ్ లో రిలీజ్ చేయడం జరిగింది. ఈ టీజర్ లో మహేష్ బాబు మేజర్ లుక్ లో అదరగొట్టారనే చెప్పాలి. సరిలేరు నీకెవ్వరు అంటూ దేవి కంపోజ్ చేసిన బ్యాక్ గ్రౌండ్ సాంగ్ తో రూపొందిన ఈ టీజర్, ప్రస్తుతం యూట్యూబ్ లో అదరగొట్టే వ్యూస్ తో దూసుకుపోతోంది. 

ఇక మహేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన ఫ్యాన్స్ ఈ టీజర్ ను చూసి ఆనందంతో ఉప్పొంగిపోతూ తమ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా మహేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. సీనియర్ నటి విజయశాంతి, సంగీత, రమ్య కృష్ణ, బండ్ల గణేష్, వెన్నెల కిశోర్, మురళి శర్మ, రాజేంద్ర ప్రసాద్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను 2020 సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు.....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: