చాలా సందర్భాలలో ఇండియన్ ఫిలిమ్స్ లో డైరెక్టర్ డైరెక్షన్ చేస్తున్నా సినిమాలలో గెస్ట్ పాత్రలో కానీ లేకపోతే చిన్న ఏదైనా పాత్రలో తళుక్కున కనబడిన సినిమాలు చాలానే ఉన్నాయి. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ నటించిన టెంపర్ సినిమా లో ఆ సినిమాని డైరెక్ట్ చేసిన పూరి జగన్నాథ్ టాక్సీ డ్రైవర్ పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. అంతేకాకుండా గతంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన ఠాగూర్ సినిమాలో వివి వినాయక్ ఆ సినిమా డైరెక్టర్ అయ్యుండి సినిమాలో చిన్న పాత్రలో కూడా నటించడం జరిగింది. ఇటువంటి తరుణంలో తాజాగా వి.వి.వినాయక్ ప్రధానపాత్రలో ఓ సినిమా తెరకెక్కుతోంది ఇందుకోసం తన బాడీ షేప్ మొత్తం వి.వి.వినాయక్ మార్చుకునే కార్యక్రమం స్టార్ట్ చేసాడు దీంతో ఇప్పుడు ఎక్కువగా వివి వినాయక్ జిమ్ లో గడుపుతున్నాడు.


అంతేకాకుండా వివాదాస్పద డైరెక్టర్ రాంగోపాల్ వర్మ కోబ్రా అనే సినిమాలో నటిస్తున్నట్లు వార్తలు వస్తుండగా తాజాగా డైరెక్టర్ తేజ కూడా ఓ సినిమాలో నటించడానికి రెడీ అయినట్లు ఫిలిం నగర్లో టాక్. విషయంలోకి వెళితే టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో ఓ పాత్రలో డైరెక్టర్ తేజ ని నటింపజేయడానికి ప్రయత్నాలు జరిగాయట. ఇది కూడా నిజ జీవితంలో ఆయన పాత్రనే అని టాక్. స్టోరీ ప్రకారం హీరోయిన్ ని ట్రైన్ చేసి నటనకు సిద్ధం చేసే పాత్రలో తేజ కనిపించాలి. ఇప్పటివరకు తేజ ఆన్ స్క్రీన్ కనిపించకపోయినా.. దిల్ రాజు చెప్పిన పాత్ర నచ్చడంతో నటించడానికి అంగీకరించాడు.


కానీ ఇప్పుడు దిల్ రాజుకి నటించడం కుదరదని చెప్పేశాడట. దానికి కారణం తేజ భార్య శ్రీవల్లి అని తెలుస్తోంది. ఎందుకంటే తన భర్త డైరెక్టర్ తేజ ని వెండితెరపై నటుడిగా చూడటం తనకి ఇష్టం లేదని భార్య శ్రీవల్లి సినిమా గురించి చెప్పిన భర్త తేజ కి మొహం మీద చెప్పటంతో డైరెక్టర్ తేజ భార్య ఒప్పుకోకపోవడంతో సినిమా నుండి పక్కకు తప్పుకున్నారా అట... ఎంత కన్విన్స్ చేసినా గాని భార్య శ్రీవల్లి ఒప్పుకోకపోవడంతో ఏం చేయలేక సినిమా క్యాన్సిల్ చేసుకున్నారట డైరెక్టర్ తేజ. 


మరింత సమాచారం తెలుసుకోండి: