టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరైన తమన్నా భాటియా, టాలీవుడ్ సినిమా పరిశ్రమకు మంచు మనోజ్ హీరోగా రూపొందిన శ్రీ సినిమాతో హీరోయిన్ గా అడుగుపెట్టడం జరిగింది. ఆ తరువాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీ డేస్ సినిమా, తమన్నాకు మంచి పేరు తీసుకువచ్చింది. ఇక అక్కడినుండి వరుసగా అవకాశాలు చేజిక్కించుకున్న తమన్నా, మెల్లగా వాటిని సద్వినియోగం చేసుకుని, అనతికాలంలోనే టాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన నటించి, అగ్ర నటిగా మంచి గుర్తింపు సంపాదించింది. అయితే తమన్నా పెళ్లి త్వరలో జరుగబోతోంది అంటూ కొద్దిరోజులుగా పుకార్లు షికారు చేస్తున్న నేపథ్యంలో నేడు ఆ పుకార్లకు అడ్డుకట్ట పడ్డట్లు ఫిలిం నగర్ వర్గాల నుండి సమాచారం అందుతోంది. 

నిజానికి గతంలో తమన్నా ఒక టాలీవుడ్ హీరోతోనూ, అలానే ఒక క్రికెటర్ తోనూ ప్రేమలో ఉన్నట్లు పలు విధాలుగా వార్తలు వచ్చాయి. అయితే అవేవి నిజం కాదని ఆమె కొట్టిపారేశారు. ఇక కొన్నాళ్ల క్రితం, ఆమె అమెరికాలోని ఒక డాక్టర్ ని వివాహం చేసుకోబోతున్నారు అంటూ కూడా వార్తలు రావడం జరిగింది. అయితే కోదిరోజులుగా ప్రచారం అవుతున్న ఈ వార్తలపై నేడు ఆమె తల్లి అయిన రజిని భాటియా గట్టిగా స్పందించినట్లు తెలుస్తోంది. తమ కుమార్తెకు త్వరలో వివాహం చేయాలని నిశ్చయించిన మాట నిజమేనని, అయితే ప్రస్తుతానికి ఇంకా సంబంధాల వేటలోనే ఉన్నాం అని, ఒకవేళ ఎవరైనా అబ్బాయి మాకు నచ్చి, 

మ్యాచ్ కుదిరితే, తప్పకుండా మీడియావారికి తెలియపరుస్తాం అని, కాబట్టి అప్పటివరకు తన కూతురు వివాహం విషయమై ఎటువంటి పుకార్లు సృష్టించవద్దని ఆమె కోరినట్లు తెలుస్తోంది. అయితే మరోవైపు మాత్రం రజిని గారు చెప్పినట్లుగా తమన్నాకు సంబంధాలు చూడం మొదలెట్టిన మాట వాస్తవమేనని, అయితే కొద్దిరోజులుగా తమన్నా ఒక అజ్ఞాత వ్యక్తితో రహస్యంగా డేటింగ్ లో ఉన్నారని, చివరకు అతడి వైఖరి తమన్నా కుటుంబసభ్యులకు కూడా నచ్చడంతో, వారు కూడా అతడిని చేసుకోవడానికి ఒప్పుకున్నారని మరొక వాదన కూడా వినపడుతోంది. అయితే ప్రస్తుతం ప్రచారం అవుతున్న కథనాలలో ఏది నిజమో తెలియాలంటే మాత్రం తమన్నా నుండి ఒక అధికారిక ప్రకటన మాత్రం వెలువడాల్సిందే అంటున్నారు విశ్లేషకులు.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: