సీక్రెట్ వ్యాదితో ప్రముఖ హీరోయిన్ నయనతార గత కొంత కాలంగా బాధ పడుతోందంటున్నారు. దీంతో ఆమె మేకప్ చేసుకోవడం కూడా కష్టంగా మారిందంటూ వదంతులు వినిపిస్తున్నాయి. గతంలో సమంత కూడా ఇలాగే చర్మ వ్యాదితో బాధపడి మూడునెలల పాటు షూటింగ్ లకు దూరంగా ఉందట. ఇప్పుడు నయనతార పరిస్థితి అలాగే తయారయిందంటున్నారు. నయనతార మాంసాహారం తీసుకున్నప్పుడల్లా బాడీ అంత చర్మం పై రాషేస్, కమిలిపోవడం జరుగుతోందట. దీంతో మేకప్ కష్టం అవుతుండగా, దాచుకోవడం కూడా ఇబ్బందిగా తయారయింది అంటూ టాలీవుడ్ లో పుకార్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే నయన కేరళ ఆయుర్వేదిక చికిత్స తో ఇంగ్లీష్ మెడికేషన్ కూడా తీసుకుంటోందంటున్నారు. అయితే ఆమె సన్నిహితులు మాత్రం ఇది అంత సీరియస్ విషయం కాదని, సాధారణ విషయమే కాబట్టి బయటకు చెప్పడం లేదన్నారు. త్వరలోనే నయమవుతుందని, ఇది షూటింగ్ లకు ఇబ్బంది కాబోదని అంటున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: