చంద‌మామ చిత్రంతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టింది కాజ‌ల్ అగ‌ర్వాల్‌. గత పదేళ్లుకు పైగా హీరోయిన్ కాజల్ అగర్వాల్ అందంతోనే కాకుండా అభినయంతో ఆకట్టుకొంటున్నారు. టాలీవుడ్‌లోని అగ్రహీరోలతోపాటు, కుర్ర హీరోలతో కూడా నటించి మెప్పించారు. ప్ర‌స్తుతం రణరంగం చిత్రంలో ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. శర్వానంద్, కల్యాణి ప్రియదర్శినితో కలిసి రణరంగంలో నటించారు. ఈ చిత్రం ఆగస్టు 15వ తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో కాజల్ ఆ చిత్ర విశేషాల‌ను పంచుకున్నారు.


‘రణరంగం’ ఒక ‘గ్యాంగ్ స్టర్’ కథ. 1990 మరియు ప్రస్తుత కాలంలోని సంఘటనల సమాహారమే ఈ ‘రణరంగం’.ఈ చిత్రంలో నేను ఒక  డాక్ట‌ర్ పాత్ర‌లో  కనిపిస్తున్నాను. సెకెండ్ హాఫ్ లో నా రోల్ ఎంటర్ అవుతుంది. చాలమంది ఈ సినిమా ఎందుకు చేశావు అంటున్నారు. కేవలం కథ నచ్చబట్టే ఈ సినిమా చేశాను. పైగా నా పాత్ర వల్లే కథ ముందుకు నడుస్తోంది. అది ఎలా అనేది సినిమాలో చూడండి.


ఇక‌పోతే నేనెప్పుడూ నిర్మాత‌న‌వ్వాల‌నుకోలేదు. నాకు నిర్మాతగా మారే ఆలోచన అయితే లేదు. ఈ మ‌ధ్య వ‌చ్చే ఈ వార్త‌లు అవాస్త‌వాలు.  రవితేజగారు ఆఫర్ చేశారు. ఆయనతో కలిసి నటించడం అంటే ఎప్పుడూ ఛాలెంజ్. అయినా నాకు ఛాలెంజ్ రోల్స్ అంటే ఇష్టమే. నేను ఎన్నిభాష‌ల్లో న‌టించినా ...నేను నటిగా పుట్టింది తెలుగులోనే కాబట్టి.. తెలుగు అంటే కొంచెం ఎక్కువ ఇష్టం. అయితే మిగిలిన భాషల్లో కూడా నాకు ఎక్కువుగా కంఫక్ట్ నే ఉంటుంది.
 
శర్వానంద్ ఈ సినిమాలో అచ్చం ‘గ్యాంగ్ స్టర్’లానే అనిపిస్తాడు. అంతబాగా తను ఆ రోల్ ను ఓన్ చేసుకుని చేశాడు. ఇక తనతో వర్క్ చేయడం చాల హ్యాపీగా అనిపించింది. సావిత్రిగారి జీవిత కధ ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’లో కీర్తి సురేష్ నిజంగా ఎంతో అద్భుతంగా నటించింది.అందుకు త‌న‌కు అవార్డు రావ‌డం చాలా ఆనందంగా ఉంది. మల్ సర్ తో ‘భారతీయుడు 2’లో యాక్ట్ చేస్తున్నాను. అలాగే ఓ తమిళ్ సినిమా కూడా చేస్తున్నాను. మరో రెండు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: